తెలుగు న్యూస్ / ఫోటో /
Voter ID Card Download : ఓటరు ఐడీ కోసం టెన్షన్ పడుతున్నారా...? సింపుల్ గా ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Telangana Assembly Elections 2023 : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ఓటరు కార్డుకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నికల సంఘం. ఇంట్లో ఉండే ఆన్ లైన్ లో మీ డిజిటల్ ఓటరు ఐడీ కార్డును పొందే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి…
- Telangana Assembly Elections 2023 : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ఓటరు కార్డుకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నికల సంఘం. ఇంట్లో ఉండే ఆన్ లైన్ లో మీ డిజిటల్ ఓటరు ఐడీ కార్డును పొందే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి…
(1 / 6)
ఓటరు కార్డును పొందాలంటే మీ - సేవా కేంద్రాలు లేదా ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లకుండా సింపుల్ గా మనమే కార్డును డౌన్లోడ్ చేసుకోనే అవకాశాన్ని కల్పించింది భారత ఎన్నికల సంఘం. ఈ మేరకు ఆ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.(CEO Telangana)
(2 / 6)
డిజిటల్ ఓటరు ఐడీ కార్డును పొందడానికి ముందుగా మీరు నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ http://voters. eci.gov.in లాగిన్ చేయాలి. తగిన వివరాలను ఇక్కడ ఇవ్వాలి ఉంటుంది.(voters.eci.gov.in)
(3 / 6)
కొత్తగా ఓపెన్ విండోలో రిజిస్టర్ మొబైల్ లేదా ఈమెయిల్ ఐడీ లేదా Epic నెంబర్ ను ఎంట్రీ చేయాలి. మీరు లాగిన్ అయిన సమయంలో ఎంచుకున్న పాస్ వర్డ్ ను కూడా నమోదు చేయటంతో పాటు… క్యాప్చాతో కూడి రిక్వెస్ట్ ఓటిపీ ని నొక్కాలి. (voters.eci.gov.in)
(4 / 6)
మీ రిజిస్టర్ మొబైల్ కు ఓటీపీసీ వస్తుంది. ఈ OTPని నిర్దేశించిన బాక్స్‌లో నమోదు చేయాలి.(https://unsplash.com)
(5 / 6)
ఆ తర్వాత డిజిల్ ఓటరు ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడానికి మీరు 'Download e-EPIC' క్లిక్ చేయాలి.(CEO Telangana)
(6 / 6)
ఇలా డౌన్లోడ్ చేసుకున్న కార్డును పీడీఎఫ్ ఫార్మాట్ లో సేవ్ చేసుకోవచ్చు. ఇక మీకు ఫిజకల్ కార్డు కావాలనుకునే వారు మీ వద్ద ఉన్న కార్డును… మీ-సేవా లేదా ఇంటర్నెట్ కేంద్రానికి వెళ్లి లామినేషన్ చేయించుకొని కార్డు పొందవచ్చు. ఈ-డిజిటల్ ఓటర్ ఐడీ అన్ని ధ్రువపత్రాల మాదిరిగానే ఎక్కడైనా చెల్లుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఓటు హక్కును కూడా వినియోగించుకోవచ్చు.(https://unsplash.com)
ఇతర గ్యాలరీలు