Charlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ రెడీ..! అదిరిపోయే ఫెసిలిటీస్, ఈ ఫొటోలు చూడండి
- SCR Charlapally Railway Terminal : చర్లపల్లి టెర్మినల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు 98 శాతం పనులు పూర్తి అయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ‘X’లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు.
- SCR Charlapally Railway Terminal : చర్లపల్లి టెర్మినల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు 98 శాతం పనులు పూర్తి అయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ‘X’లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు.
(1 / 8)
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని చర్లపల్లి టెర్మినల్ నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయి. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్‌రెడ్డి వివరాలను తెలిపారు. (Photo From @kishanreddybjp Twitter)
(2 / 8)
చర్లపల్లి టెర్మినల్ తెలంగాణలోనే నాలుగో అతి పెద్ద టెర్మినల్‌గా అవతరిస్తుందని పేర్కొన్నారు.(Photo From @kishanreddybjp Twitter)
(3 / 8)
ఈ కొత్త టెర్మినల్ ఓపెన్ అయితే… హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని కేంద్రమంత్రి తెలిపారు.(Photo From @kishanreddybjp Twitter)
(4 / 8)
రూ.434 కోట్లతో చర్లపల్లి స్టేషన్ టెర్మినల్ ను నిర్మించారు. 15 జతల రైళ్ల రాకపోకల సామర్థ్యాన్ని కలిగి ఉందని కిషన్ రెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు. (Photo From @kishanreddybjp Twitter)
(5 / 8)
ప్రస్తుతం దాదాపుగా పనులన్నీ పూర్తి కావడంతోనే త్వరలోనే చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ టెర్మినల్ ప్రారంభం కానుంది.(Photo From @kishanreddybjp Twitter)
(6 / 8)
అధిక ప్రయాణికుల రాక పోకలకు అనుగుణంగా కొత్తగా నిర్మితమైన ఈ స్టేషన్ భవనం అత్యంత ఆధునికంగా మరియు సౌందర్య వంతమైన ముఖ్య ద్వారంతో నిర్మించడం జరిగింది.(Photo From @kishanreddybjp Twitter)
(7 / 8)
ఈ స్టేషన్ భవనం లో గ్రౌండ్ ఫ్లోర్లో ఆరు టికెట్ బుకింగ్ కౌంటర్లు, లేడీస్ వెయిటింగ్ హాల్, పురుషుల వెయిటింగ్ హాల్, ఎగువ తరగతి వెయిటింగ్ హాల్, ఎగ్జిక్యూటివ్ లాంజ్ మరియు మొదటి అంతస్తులో కేఫ్టేరియా, రెస్టారెంట్, స్త్రీలకు మరియు పురుషులకు కోసం విశ్రాంతి గదులు ఉంటాయి. స్టేషన్ ముఖద్వారానికి అత్యాధునిక లైటింగ్వ్యవస్థ ఏర్పాటు చేయబడింది.(Photo From @kishanreddybjp Twitter)
ఇతర గ్యాలరీలు