
(1 / 7)
పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని హోలీ పండుగలను నిర్వహించుకోవాలి .హోలీని చేసుకోవడానికి ఎకో ఫ్రెండ్లీ పద్ధతిని ఫాలో అవ్వాలి.
(Pexels)
(2 / 7)
పర్యావరణానికి, మీ చర్మానికి హాని కలిగించే రంగులను వాడకూడదు. ఆ రంగులకు బదులుగా పువ్వులు, పసుపు, ఇతర మొక్కల ఆధారిత వనరుల నుండి తయారైన సేంద్రీయ సహజ రంగులను వినియోగించుకోవాలి.
(Pexels)
(3 / 7)
బీట్రూట్, పాల కూర, గోరింటాకు వంటి పదార్థాలను ఉపయోగించి ఇంట్లో మీ సొంత పర్యావరణ అనుకూల రంగులను తయారు చేయండి. వీటిని చేయడం చాలా సులువు.
(Pexels)
(4 / 7)
ఈ పండుగ సమయంలో నీటిని వృథా చేయవద్దు, పొడి రంగులతో లేదా పరిమిత నీటితో హోలీ ఆడటం ద్వారా మీరు బాధ్యతగా ఉండండి.
(Pexels)
(5 / 7)
రంగు రంగుల పువ్వులు, ఆకులతో నచ్చిన రంగులను తయారు చేసుకోవచ్చు. అవి అనుకోకుండా కళ్లలో పడినా పెద్ద ప్రమాదం లేదు.
(Pexels)
(6 / 7)
హోలీ అంటే కేవలం నీళ్లు చల్లుకోవడం, రంగులు పోసుకోవడమే కాదు… పర్యావరణ హిత కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం ద్వారా కూడా సెలెబ్రేట్ చేసుకోవచ్చు.
(Pexels)
(7 / 7)
మీ హోలీ వేడుకల్లో భాగంగా, చెట్లను నాటడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం, పచ్చదనాన్ని పెంచడం వంటి కార్యక్రమాలను చేపట్టండి.
(Pexels)ఇతర గ్యాలరీలు