తెలుగు న్యూస్ / ఫోటో /
Nigeria demonetisation: నైజీరియాలో నోట్లరద్దు కష్టాలు..
- Nigeria demonetisation: 2016 నవంబర్ లో భారత ప్రధాని నరేంద్రమోదీ రూ. 1000, రూ. 500 నోట్ల రద్దును ప్రకటించిన తరువాత రోజులు గుర్తున్నాయా? ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు కిలోమీటర్ల పొడవాటి క్యూలు గుర్తున్నాయా? ఆ క్యూలలోనే నిల్చుని ప్రాణాలు పోగొట్టుకున్న అభాగ్యులు గుర్తున్నారా?.. గుర్తు లేకపోతే నైజీరియాలో ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. ఈ ఫొటోలు చూస్తే, భారత్ లో నోట్ల రద్దు నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి తీరుతాయి. నైజీరియా ప్రభుత్వం ఇటీవల రూ. 1000, రూ. 500, రూ. 200 నోట్లను రద్దు చేసింది.

(1 / 7)
Nigeria demonetisation: దేశంలో అవినీతిని అంతమొందించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం లక్ష్యంగా నైజీరియా ప్రభుత్వం రూ. 1,000, రూ., 500, రూ. 200 నోట్లను రద్దు చేసింది.(AFP)
(2 / 7)
Nigeria demonetisation: నోట్ల రద్దుతో నగదుకు కరువు ఏర్పడడంతో, నైైజీరియా ప్రజలు ఇలా ఏటీఎంల ముందు క్యూ కట్టడం ప్రారంభించారు.(REUTERS)
(3 / 7)
Nigeria demonetisation: పెద్ద నోట్లను నోట్లను రద్దు చేసిన నైజీరియా ప్రభుత్వం.. ఆ మేరకు కొత్త నోట్లను సిద్ధం చేయలేకపోయింది. దాంతో, బ్యాంకులు, ఎక్సేంజ్ సెంటర్ల వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. (REUTERS)
(4 / 7)
Nigeria demonetisation: గంటల తరబడి ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు నిల్చున్నా, ఫలితం లేకపోవడంతో నైజీరియా ప్రజలు కోపంతో ఏటీఎం మెషీన్లను ధ్వంసం చేస్తున్నారు. బ్యాంకు సిబ్బందితో గొడవ పడుతున్నారు. రోడ్లపై నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాత నోట్ల మార్పిడికి డెడ్ లైన్ పెట్టడంతో వారి ఆందోళన మరింత తీవ్రమవుతోంది. (REUTERS)
(5 / 7)
Nigeria demonetisation: నైజీరియాలో మరో రెండు వారాల్లో జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. నోట్ల రద్దు సమస్యలతో ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది.(AFP)
(6 / 7)
Nigeria demonetisation: నోట్ల రద్దుతో నైజీరియా లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా వారు తమ డబ్బులను బ్యాంకుల్లో కాకుండా, ఇళ్లల్లోనే దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు ఆ రద్దైన నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడం వారికి చాలా సమస్యగా మారింది.(AFP)
ఇతర గ్యాలరీలు