Decode Fruit Stickers | స్టిక్కర్ ఉన్న పండ్లను కొంటున్నారా? అయితే జర జాగ్రత్త..-buying sticker on fruit at a higher price but you know the what a sticker means ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Decode Fruit Stickers | స్టిక్కర్ ఉన్న పండ్లను కొంటున్నారా? అయితే జర జాగ్రత్త..

Decode Fruit Stickers | స్టిక్కర్ ఉన్న పండ్లను కొంటున్నారా? అయితే జర జాగ్రత్త..

May 24, 2022, 11:30 AM IST Geddam Vijaya Madhuri
May 24, 2022, 11:30 AM , IST

  • కొన్నేళ్లుగా స్టిక్కర్లతో కూడిన పండ్లను మార్కెట్‌లలో విక్రయిస్తున్నారు. కొంతమంది ఈ రకమైన పండ్లు మంచివని భావిస్తారు. అందుకే వాటికి ఎక్కువ ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడరు. కానీ అసలు పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో మీకు తెలుసా?

సూపర్ మార్కెట్​లు, సాధారణ దుకాణాల్లో.. పండ్లపై స్టిక్కర్లు ఉంటున్నాయి. చాలా మంది స్టిక్కర్ ఉన్న పండ్లే నాణ్యత పరంగా మంచివని భావిస్తారు. 

(1 / 7)

స్టిక్కర్ ఉన్న పండ్ల ధర కొన్నిసార్లు ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. అయితే ఒక్కో స్టిక్కర్​కు ఒక్కో కారణం ఉంటుందని మీకు తెలుసా?

(2 / 7)

కాబట్టి మార్కెట్ నుంచి స్టిక్కర్ ఉన్న పండ్లను కొనుగోలు చేసే ముందు.. స్టిక్కర్ అంటే ఏమిటో తెలుసుకోండి. అప్పుడు వాటిని కొనాలో వద్దో నిర్ణయించుకోండి. 

(3 / 7)

పండుపై ఉన్న స్టిక్కర్‌పై 4 అంకెల కోడ్ ఉంటే.. అది 3 లేదా 4తో ప్రారంభమైతే.. అది కృత్రిమ ఎరువులు, పురుగుమందులు ఉపయోగించి పండించినట్లు అర్థం చేసుకోవాలి. 

(4 / 7)

స్టిక్కర్‌పై 5 అంకెల కోడ్, ప్రారంభ సంఖ్య 8 ఉంటే.. అప్పుడు దానిని జన్యుపరంగా సవరించినట్లు గుర్తించాలి. వాటిని తింటే.. మీ శరీరంలోని జన్యువులు దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచండి. 

(5 / 7)

పండు స్టిక్కర్‌పై 5 అంకెల కోడ్‌ ఉండి.. అది 9తో ప్రారంభమైతే.. అది పూర్తిగా సేంద్రీయ ప్రక్రియ అని అర్థం చేసుకోవాలి. ఇందులో ఎలాంటి పురుగుమందులు, రసాయన ఎరువులు ఉండవు. ఇది అత్యంత సురక్షితమైనది.

(6 / 7)

అయితే చాలా సందర్భాల్లో కొందరు ఈ స్టిక్కర్లను మారుస్తారు. కాబట్టి ప్రసిద్ధ పండ్ల విక్రేత లేదా పేరున్న స్టోర్ నుంచి పండ్లను కొనడానికి ప్రయత్నించండి.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు