(1 / 6)
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో మొత్తంగా 14 మంది (ప్రస్తుతం 13 మంది ఉన్నారు) సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. వారిలో పదో కంటెస్టెంట్‍గా ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ రతిక రోజ్. చమ్కీల అంగీలేసి అనే పాటకు స్టెప్పులు వేసి ఆకట్టుకుంది.
(Instagram)(2 / 6)
ఆకట్టుకునే స్టెప్పులు వేసిన రతిక రోజ్ కింగ్ నాగార్జున సరదాగా ముచ్చటించింది. తన బ్రేకప్‍కు నాగార్జున, పెద్దయ్య (బిగ్ బాస్) కారణం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక హౌజ్‍లోకి వెళ్లిన రతకి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‍తో చనువుగా ఉండటం మొదలుపెట్టింది.
(3 / 6)
అయితే రతిక రోజ్ అసలు పేరు ప్రియా. తెలంగాణలోని వికారాబాద్‍కు చెందిన ఈ ముద్దుగుమ్మ నటిగా ఎదగాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మోడల్‍గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటి రతిక రోజ్‍గా పేరు మార్చుకుంది. అలా ఇప్పటివరకు అలరిస్తోంది.
(4 / 6)
రతిక రోజ్ అని పేరు మార్చుకోడానికి ముందు 2016లో బుల్లితెరపై పాపులర్ షోగా వచ్చిన పటాస్‍లో స్టాండప్ కమెడియన్‍గా ఆకట్టుకుంది. పటాస్ ప్రియా పేరుతో జోక్స్ వేస్తూ, కామెడీ టైమింగ్‍తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
(Instagram)(5 / 6)
ఏడాది పాటు టీవీ షోలో కనిపించిన రతిక రోజ్ తర్వాత కొంత కాలం బ్రేక్ తీసుకుని మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ భామకు మెయిన్ రోల్స్ రాలేదు. అయితే ఈ తెలుగు అమ్మాయికి తమిళంలో హీరోయిన్‍గా ఛాన్స్ వచ్చింది.
(6 / 6)
రతిక రోజ్ తమిళంలో చేసిన మారో మూవీ విడుదలకు ముందే ఆగిపోయింది. అనంతరం తెలుగులో బెల్లంకొండ గణేష్ హీరోగా చేసిన నేను స్టూడెంట్ సర్ సినిమాలో రతిక రోజ్ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు నటిగా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయిన్సర్‍గా బిగ్ బాస్ 7 తెలుగులోకి అడుగు పెట్టింది.
ఇతర గ్యాలరీలు