తెలుగు న్యూస్ / ఫోటో /
Bharat Jodo Yatra: శ్రీనగర్ లాల్ చౌక్‍లో జాతీయ జెండా ఆవిష్కరించిన రాహుల్ గాంధీ.. భారీ కటౌట్, పటిష్ఠ భద్రత: ఫొటోలు
- Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర తుది దశకు చేరుకుంది. ఈ తరుణంలో ఆదివారం (జనవరి 29).. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ప్రసిద్ధ లాల్ చౌక్ వద్ద జాతీయ జెండాను రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫొటోలతో పాటు వివరాలివే..

(1 / 8)
భారత్ జోడో యాత్ర తుది దశలో భాగంగా ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఆదివారం (జనవరి 29) శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్ క్లాక్ టవర్ వద్ద జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. ప్రధాని పర్యటన సమయంలో చేపట్టే లాంటి పటిష్ఠ భద్రత మధ్య ఈ కార్యక్రమం జరిగింది. రేపటి (జనవరి 30)తో భారత్ జోడో యాత్ర ముగియనుంది. (AFP)
(2 / 8)
జమ్ము కశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (JKPCC)కి ముందుగా చేరుకొని.. అక్కడి నుంచి లాల్ చౌక్‍కు వచ్చారు రాహుల్. (PTI)
(3 / 8)
జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించాలని ముందుగా ప్లాన్ చేసుకున్నామని, కానీ ముందుగా నిర్వహించాల్సి వచ్చిందని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, కమ్యూనికేషన్స్ ఇన్‍చార్జ్ జైరామ్ రమేశ్.. ట్విట్టర్ ద్వారా తెలిపారు.(ANI)
(4 / 8)
“జనవరి 30వ తేదీన పీసీసీ ఆఫ్ వద్ద జాతీయ జెండాను రాహుల్ గాంధీ ఆవిష్కరించాల్సింది. అయితే అనుమతలి దక్కలేదు. అయితే లాక్ చౌక్ వద్ద కార్యక్రమం నిర్వహించుకునేందుకు రాష్ట్ర అధికారులు అనుమతిని ఇచ్చారు. అందుకే ఈ రోజు నిర్వహించాం” అని రమేశ్ ట్వీట్ చేశారు.(ANI)
(5 / 8)
లాల్ చౌక్ వద్ద కిలో మీటర్ పరిధి వరకు శనివారం రాత్రి నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. భద్రతా సిబ్బంది భారీగా మోహరించారు. (ANI)
(7 / 8)
జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా అన్ని దుకాణాలు, వ్యాపారాలు, వారాంతపు మార్కెట్‍ను కూడా మూయించారు.(ANI)
ఇతర గ్యాలరీలు