Sathyaraj: నేను అప్పుడు ప్లే బాయ్‌ని.. అలా చేయకపోతే హార్మోన్ సరిగా పనిచేయట్లేదని అర్థం.. బాహుబలి కట్టప్ప కామెంట్స్
Sathyaraj About Love Over My Perfect Husband OTT Release: బాహుబలిలో కట్టప్పగా చాలా పాపులర్ అయిన నటుడు సత్యరాజ్ తన కాలేజ్ డేస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. మై పర్‌ఫెక్ట్ హస్బండ్ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ ప్రమోషన్స్‌లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ప్లే బాయ్ అని చెప్పారు.
(1 / 6)
తమిళ నటి రేఖ, నటుడు, బాహుబలి కట్టప్ప సత్యరాజ్ నేటితరం ప్రేమ గురించి లిటిల్ టాక్స్ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మై పర్‌ఫెక్ట్ హస్బండ్ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు సత్యరాజ్.
(2 / 6)
“నేను అప్పుడు కాలేజీ సమయంలో ప్లే బాయ్‌ని. మనం అలా చేయకపోతే హార్మోన్ సరిగా పనిచేయడం లేదని అర్థం” అని సత్యరాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
(3 / 6)
"కానీ, ఆ రోజుల్లో ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడం చాలా అరుదుగా ఉండేది. అలాగే చాలా కష్టంగా కూడా ఉండేది. కాబట్టి నేటితరం యువతలో మనల్ని మనం ఊహించుకోగలిగాము" అని సత్యరాజ్ అన్నారు.
(4 / 6)
"ఏదైనా సమయంలో ఒక స్త్రీ మనల్ని ఇష్టపడితే, ఆమెని మనం కూడా ఇష్టపడితే అది చెప్పి ప్రేమను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడం అనేది మాత్రం చాలా సాహసంగా ఉండేది. ఆ రోజుల్లో మనం ఎంతో కష్టపడితేనే మనం కోరుకున్న అమ్మాయి దక్కేది" అని సత్యరాజ్ చెప్పారు.
(5 / 6)
నటి రేఖ మాట్లాడుతూ "ఇక్కడ ఎవరు పర్‌ఫెక్ట్ భర్త కాలేరు. వారిలో ఏదో ఒక లోపం కచ్చితంగా ఉంటుంది. అయితే, వెయ్యి మందిలో ఒకరు, లక్ష మందిలో ఒకరు పరిపూర్ణమైన భర్తను పొందవచ్చు. ఇక్కడ ఎవ్వరూ ఎవరినీ జడ్జ్ చేయలేరు" అని చెప్పుకొచ్చారు.
(6 / 6)
“అలాగని మనం ఎక్కువగా ఆశించకూడదు. వారి లోపాలను సర్దుబాటు చేసుకుని అంగీకరించినప్పుడే రిలేషన్‌షిప్ కొనసాగుతుంది. ఇది సముద్రపు అల లాంటిది. రిలేషన్‌షిప్ ఇలానే ఉంటుంది. నాకు భర్త కావాలని మీరు ఆశిస్తారు. కానీ, మీకు దక్కేది మీకు ఏది రాసిపెట్టి ఉందో అదే. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని అని చాలా మంది చెప్పారు. కారణం నా భర్తే. నా కెరీర్ నిర్ణయాలే. ఇన్‌పుట్స్ విషయంలో ఆయన జోక్యం చేసుకోరు. అతనికి తన పని ఉంది. అతను తన పనిని తన వృత్తిగా చూసుకుంటున్నాడు. సత్యరాజ్ భార్య తన వృత్తిపరమైన నిర్ణయాలకు అదే విధంగా సహకరిస్తుంది. అందుకే ఆయన ఇలా పనిచేయగలుగుతున్నారు” అని రేఖ తెలిపారు.
ఇతర గ్యాలరీలు