Tripti Dimri Vingage Look: చీరకట్టుతో వింటేజ్ లుక్‍లో హొయలు ఒలికించిన ‘యానిమల్’ భామ తృప్తి: ఫొటోలు
- Tripti Dimri Vingage Look Photos: బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి చీరలో మెరిశారు. అది కూడా వింటేజ్ లుక్‍తో వారెవా అనిపించారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.
- Tripti Dimri Vingage Look Photos: బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి చీరలో మెరిశారు. అది కూడా వింటేజ్ లుక్‍తో వారెవా అనిపించారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.
(1 / 5)
ఎక్కువగా మోడ్రన్ డ్రెస్‍ల్లో కనిపించే బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి.. అప్పుడప్పుడూ చీరకట్టులోనూ తళుక్కుమంటుంటారు. ఏ లుక్‍లో అయినా అదరగొడుతుంటారు. అయితే, తాజాగా వింటేజ్ లుక్‍లో మెరిపించారు తృప్తి. 1990ల నాటి లుక్‍తో మైమరిపించారు.
(2 / 5)
వింటేజ్ లుక్ ఉండేలా ఫ్లవర్ డిజైన్ ఉన్న చీరను ధరించారు తృప్తి డిమ్రి. గ్రీన్ షేడ్ చీరపై.. రెడ్ కలర్ ఫ్లవర్ ప్యాటర్న్‌తో యునీక్‍గా ఉన్న చీరలో హొయలు ఒలికించారు.
(3 / 5)
హెయిర్ స్టైల్ నుంచి గాజులు, గ్లాసెస్ వరకు అలనాటి లుక్ వచ్చేలా ధరించారు తృప్తి డిమ్రి. ఈ వింటేజ్ ఔట్‍ఫిట్‍లో కెమెరాలకు అట్రాక్టివ్ పోజులు ఇచ్చారు.
(4 / 5)
ఈ ఫొటోలను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో నేడు (సెప్టెంబర్ 14) పోస్ట్ చేశారు తృప్తి డిమ్రి. ఆమె లుక్‍కు నెటిజన్లు వారెవా అంటున్నారు. తాను నటించిన ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ అక్టోబర్ 11న రిలీజ్ కానుండగా.. ప్రమోషన్లలో పాల్గొంటున్నారు తృప్తి. ఈ చిత్రం కూడా 1990ల బ్యాక్‍డ్రాప్‍లో నడుస్తుంది.
ఇతర గ్యాలరీలు