తెలుగు న్యూస్ / ఫోటో /
Dandruff Tips: తలపై చుండ్రు, దురద ఎక్కువగా ఉన్నాయా? తగ్గేందుకు ఈ టిప్స్ ఫాలో అవండి
Dandruff Tips: కొందరికి తలపై చుండ్రు (డాండ్రఫ్) ఎక్కువగా ఉంటుంది. దురద కూడా ఎక్కువగా పెడుతుంటుంది. జుట్టులో చుండ్రు ఆందోళన కలిస్తుంది. అయితే, ఈ సమస్య తగ్గేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఇవే..
(1 / 6)
తలపై చుండ్రు అనేది సాధారణమైన సమస్యగా మారిపోయింది. చాలా మంది దీన్ని ఎదుర్కొంటున్నారు. చుండ్ర వల్ల దురద కూడా పెరిగిపోతుంది. అయితే, కొన్ని ఇంటి చిట్కాలతోనే జుట్టుపై చుండ్రును తగ్గించుకోవచ్చు. ప్రభావంతంగా పని చేసే ఆ టిప్స్ ఏవో ఇక్కడ చూడండి. (freepik)
(2 / 6)
నిమ్మరసం: తలపై చుండ్రును తగ్గించేందుకు నిమ్మరసం చాలా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉండడమే ఇందుకు కారణం. ముందుగా నిమ్మరసాన్ని జుట్టుకు, కుదుళ్లకు పట్టించాలి. ఆ తర్వాత 20 నిమిషాలు ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
(3 / 6)
నిమ్మ - కొబ్బరినూనె: నిమ్మరసం, కొబ్బరి నూనె జుట్టు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. తలకు తేమను అందించి నిగారింపజేస్తాయి. చుండ్రును తొలగిస్తాయి. రెండు టేబుల్ స్పూన్‍లో కొబ్బరి నూనెలో నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని కాస్త వేడి చూసి తలకు మర్దన చేయాలి. 30 నిమిషాలు ఆరనిచ్చి తలస్నానం చేసేయాలి.
(4 / 6)
కలబంద జెల్: చుండ్రును, దురదను తగ్గించేందుకు కలబంద (అలోవెరా) జెల్ చాలా ఉపయోగపడుతుంది. అలోవేరా జెల్‍ను తలపై రాసుకొని 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
(5 / 6)
మెంతుల పేస్ట్: చుండ్రును మెంతులు కూడా ప్రభావంతంగా పని చేస్తాయి. ముందుగా మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్ని దాన్ని మెత్తగా, పల్చగా పేస్ట్ చేసుకోవాలి. దాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.
(6 / 6)
ఉసిరి: చుండ్రును తగ్గించేందుకు ఉసిరికాయల్లో ఉంటే విటమిన్ సీ తోడ్పడుతుంది. ఉసిరికాయ పొడిలో కాస్త నీరు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ ఇంటి చిట్కాలు చుండ్రును తగ్గించేందుకు సహాయపడతాయి. అలాగే, జుట్టు ఆరోగ్యం కోసం పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం, సరైన ప్రొడక్టులు వాడడం, శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం.
ఇతర గ్యాలరీలు