తెలుగు న్యూస్ / ఫోటో /
Apple స్మార్ట్‌వాచ్‌లలో తీవ్రమైన సాంకేతిక లోపాలు.. పరిష్కారం ఎలా?
Appleకు సంబంధించిన ఎలాంటి ఉత్పత్తులైనా చాలా ఖరీదు ఉంటాయి. అయితే మీరు Apple వాచ్ 6 కొనుగొలు చేసి ఉంటే వాటిలోని ని కొన్ని యూనిట్‌లలో తీవ్రమైన సాంకేతిక లోపం కారణంగా డిస్‌ప్లే శాశ్వతంగా ఖాళీగా అయ్యే అవకాశం ఉందని Apple సంస్థ అంగీకరించింది. మరి దీనికి పరిష్కారం ఎలా? ఇక్కడ చూడండి..
Appleకు సంబంధించిన ఎలాంటి ఉత్పత్తులైనా చాలా ఖరీదు ఉంటాయి. అయితే మీరు Apple వాచ్ 6 కొనుగొలు చేసి ఉంటే వాటిలోని ని కొన్ని యూనిట్‌లలో తీవ్రమైన సాంకేతిక లోపం కారణంగా డిస్‌ప్లే శాశ్వతంగా ఖాళీగా అయ్యే అవకాశం ఉందని Apple సంస్థ అంగీకరించింది. మరి దీనికి పరిష్కారం ఎలా? ఇక్కడ చూడండి..
(1 / 6)
'బ్లాక్ స్క్రీన్ ఆఫ్ డెత్' అని పిలిచే ఒక లోపం ఇప్పుడు ప్రసిద్ధ Apple Watch 6 స్మార్ట్‌వాచ్‌లను ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సాంకేతిక లోపం గతంలోనూ Apple Watch సిరీస్ 2, సిరీస్ 3 అలాగే సిరీస్ 5లో కూడా కనిపించింది.(REUTERS)
(2 / 6)
MacWorld ప్రకారం, Apple Watch Series 6 స్మార్ట్‌వాచ్‌లలో బ్లాంక్ డిస్‌ప్లేకు సంబంధించిన ఫిర్యాదులు గతేడాది నుంచి రావడం మొదలయ్యాయి. ఆపిల్ సంస్థ తప్పును అంగీకరించినప్పటికీ, చాలా తక్కువ సంఖ్యలో స్మార్ట్‌వాచ్‌లు ప్రభావితమయ్యాయని తెలిపింది.(Apple)
(3 / 6)
అయితే ఈ Apple Watchలలో డిస్‌ప్లే పనిచేయకపోయినా కొన్ని అంశాలలో పనిచేస్తాయి. స్క్రీన్‌పై నొక్కినప్పుడు లేదా డయల్‌ని క్లిక్ చేసినప్పుడు శబ్దాలు చేయడం, అన్‌లాక్ చేయడం లాంటి ఫీచర్లు పనిచేయవచ్చు.(Apple)
(4 / 6)
సిరీస్ 6 స్మార్ట్‌వాచ్‌లలో సమస్యలు పరిష్కరించడానికి ఉచిత సేవను అందిస్తామని హామీ ఇచ్చింది. లోపభూయిష్టమైన ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ల కోసం ఇప్పటికే ఉచిత రిపేర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. అయితే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2021 మధ్య తయారయిన Apple Watch 6 40mm స్మార్ట్‌వాచ్‌లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఇందుకోసం వాచ్ సీరియల్ నంబర్‌ను Apple సపోర్ట్ పేజీలలోని విడ్జెట్‌లో నమోదు చేయమని కోరింది.(Apple)
(5 / 6)
Apple ఉచిత రిపేర్ ప్రోగ్రామ్‌కు ముగింపు తేదీని ప్రకటించనప్పటికీ, కొనుగోలు చేసిన తేదీ నుంచి 2 సంవత్సరాల దాటని యూజర్లు ఇఉచితంగా రిపేర్ చేసుకునేందుకు అర్హులని కంపెనీ పేర్కొంది.(REUTERS)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు