AP Wine Shops Lottery : ఏపీ మద్యం షాపుల లాటరీపై కీలక అప్డేట్, డ్రాలో పాల్గొనేందుకు ఆథరైజ్డ్ పర్సన్ కు అనుమతి-ap wine shop tender lottery system excise department allowed authorized person ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Wine Shops Lottery : ఏపీ మద్యం షాపుల లాటరీపై కీలక అప్డేట్, డ్రాలో పాల్గొనేందుకు ఆథరైజ్డ్ పర్సన్ కు అనుమతి

AP Wine Shops Lottery : ఏపీ మద్యం షాపుల లాటరీపై కీలక అప్డేట్, డ్రాలో పాల్గొనేందుకు ఆథరైజ్డ్ పర్సన్ కు అనుమతి

Oct 06, 2024, 07:15 PM IST Bandaru Satyaprasad
Oct 06, 2024, 07:15 PM , IST

  • AP Wine Shops Lottery : ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. కొత్త షాపులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. లాటరీ విధానంలో మద్యం షాపులను కేటాయించనున్నారు. అయితే లాటరీ ప్రక్రియలో దరఖాస్తుదారుడికి ప్రతినిధిగా మరో వ్యక్తి పాల్గొనవచ్చని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. కొత్త షాపులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. లాటరీ విధానంలో మద్యం షాపులను కేటాయించనున్నారు.  

(1 / 6)

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. కొత్త షాపులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. లాటరీ విధానంలో మద్యం షాపులను కేటాయించనున్నారు.  

నూతన మద్యం పాలసీ 2024-26ను అనుసరించి మద్యం షాపుల ఎంపిక కోసం నిర్వహించే లాటరీ ప్రక్రియపై ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ కీలక ప్రకటన చేసింది.  లాటరీలో పాల్గొనవలసిన వ్యక్తి తన తరుపున ఇతరులకు అనుమతిని ఇవ్వవచ్చని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. 

(2 / 6)

నూతన మద్యం పాలసీ 2024-26ను అనుసరించి మద్యం షాపుల ఎంపిక కోసం నిర్వహించే లాటరీ ప్రక్రియపై ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ కీలక ప్రకటన చేసింది.  లాటరీలో పాల్గొనవలసిన వ్యక్తి తన తరుపున ఇతరులకు అనుమతిని ఇవ్వవచ్చని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. (Unsplash)

ఒక వ్యక్తి ఒక దుకాణం కోసం దాఖలు చేసే దరఖాస్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదని, అదే క్రమంలో ఒక వ్యక్తి నిర్వహించగల దుకాణాల సంఖ్యపై కూడా పరిమితి విధించలేదని, ఎన్ని షాపులకైనా ఒకే వ్యక్తి దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

(3 / 6)

ఒక వ్యక్తి ఒక దుకాణం కోసం దాఖలు చేసే దరఖాస్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదని, అదే క్రమంలో ఒక వ్యక్తి నిర్వహించగల దుకాణాల సంఖ్యపై కూడా పరిమితి విధించలేదని, ఎన్ని షాపులకైనా ఒకే వ్యక్తి దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.(Unsplash)

ఒక వ్యక్తి ఎక్కువ షాపులకు దరఖాస్తు చేసుకునే క్రమంలో లాటరీ ప్రక్రియలో... అతని తరుపున మరొకరు దరఖాస్తులు దాఖలు చేయడానికి, డ్రాలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రొఫార్మా విడుదల చేశామని అధికారులు తెలిపారు.  

(4 / 6)

ఒక వ్యక్తి ఎక్కువ షాపులకు దరఖాస్తు చేసుకునే క్రమంలో లాటరీ ప్రక్రియలో... అతని తరుపున మరొకరు దరఖాస్తులు దాఖలు చేయడానికి, డ్రాలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రొఫార్మా విడుదల చేశామని అధికారులు తెలిపారు.  (Pixabay)

ఎక్సైజ్ శాఖ సూచించిన విధానంలో సాధారణ తెల్ల కాగితంపై దరఖాస్తుదారుని పేరు, అధీకృత వ్యక్తి పేరు వివరాలు నమోదు చేసి అధికారులకు అందచేస్తే సరిపోతుందన్నారు. 

(5 / 6)

ఎక్సైజ్ శాఖ సూచించిన విధానంలో సాధారణ తెల్ల కాగితంపై దరఖాస్తుదారుని పేరు, అధీకృత వ్యక్తి పేరు వివరాలు నమోదు చేసి అధికారులకు అందచేస్తే సరిపోతుందన్నారు. (pixabay)

రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు, డిప్యూటీ కమీషనర్‌లు ఈ అంశాలను పరిగణన లోకి తీసుకుని,  అందుకు అనుగుణంగా వ్యవహరించవలసి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, ప్రోహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ ఆదేశించారు.

(6 / 6)

రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు, డిప్యూటీ కమీషనర్‌లు ఈ అంశాలను పరిగణన లోకి తీసుకుని,  అందుకు అనుగుణంగా వ్యవహరించవలసి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, ప్రోహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ ఆదేశించారు.(Pixabay)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు