తెలుగు న్యూస్ / ఫోటో /
AP SSC Mark Memos 2024 : ఆ తేదీ నుంచే ఏపీ టెన్త్ 'షార్ట్ మెమోలు' - విద్యాశాఖ కీలక ప్రకటన
- AP 10th Class Results Memos 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు(AP 10th Class Results) విడుదలయ్యాయి. అయితే విద్యార్థుల షార్ట్ మెమోలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ విద్యాశాఖ. నాలుగు రోజుల్లోనే వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించింది.

(1 / 6)
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల్లో 86.69శాతం పాస్ అయ్యారు. ఇందులో బాలురు 84.32, బాలికలు 89.17 ఉత్తీర్ణత సాధించారు.
(2 / 6)
ఏపీ పదో తరగతి ఫలితాల్లో ఈసారి బాలికలదే పైచేయి. 2803 స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని అధికారులు ప్రకటించారు. 17స్కూల్స్ లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. టాప్ ప్లేస్ మన్యం జిల్లా నిలవగా…. కర్నూల్ జిల్లా 62.47శాతం తో చివరి స్థానంలో నిలిచింది
(3 / 6)
ఇక విద్యార్థుల షార్ట్ మెమోలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ విద్యాశాఖ. 4 రోజుల్లోనే పూర్తి వివరాలతో కూడిన షార్ట్ మెమోలను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది.
(4 / 6)
ఈ మెమోలను AP SSC బోర్డు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. స్కూల్స్ హెడ్ మాస్టర్ లాగిన్ ఐడీకి కూడా ఈ మెమోలను పంపుతామని తెలిపింది.
(5 / 6)
స్కూల్ కు వెళ్లకుండానే…. https://results.bse.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి షార్ట్ మెమోలను విద్యార్థులు పొందవచ్చని వెల్లడించింది.
ఇతర గ్యాలరీలు