AP TG Weather Updates : బంగాళాఖాతంలో వాయుగుండం - ఇవాళ, రేపు అత్యంత భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ...!
- AP Telangana Rains : వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది ఇవాళ బలహీన పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Rains : వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది ఇవాళ బలహీన పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 7)
ఐఎండి సూచనల ప్రకారం వాయువ్య మరియు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది.
(2 / 7)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ(జులై 20) తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఆ తరువాత క్రమంగా బలహీనపడనుంది.
(3 / 7)
ఈ ప్రభావంతో ఇవాళ (జులై 20) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(4 / 7)
అలాగే ఇవాళ కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(5 / 7)
ఇప్పటికే అత్యవసర సహాయక చర్యల కోసం ఏలూరు జిల్లా 2 ఎస్డీఆర్ఎఫ్, కోనసీమ1 ఎస్డీఆర్ఎఫ్, తూర్పుగోదావరి 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినట్లు ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది.
(6 / 7)
ఎగువ నుంచి వస్తున్న వరద, రాష్ట్రంలోని భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు.
(7 / 7)
ఇక తెలంగాణలో చూస్తే రెండు రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ(జులై 20) ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంది. ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది. ఇక ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఇతర గ్యాలరీలు