తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : తుఫాన్ ఎఫెక్ట్..! ఏపీ, తెలంగాణలో వర్షాలు, పాపికొండల విహారయాత్రకు 4 రోజులు బ్రేక్..!
- AP Telangana Weather News : ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో తుఫాన్ పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను 4 రోజులపాటు నిలిపివేశారు.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
రుతుపవనాల విస్తరణతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడుతుండగా… మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.(image source unsplash.com)
(2 / 6)
పశ్చిమ మధ్యను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తుఫాన్ పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.
(3 / 6)
ఇవాళ (జూన్ 28) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(4 / 6)
ఇక ఇవాళ హైదరాబాద్ సిటీలో చూస్తే తేలికపాటి లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో గంటకు 8 -12 కి.మీ వేగంతో వీచే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.(image source unsplash.com)
(5 / 6)
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.(image source unsplash.com)
ఇతర గ్యాలరీలు