Investigative Thriller Movies: తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న బెస్ట్ మలయాళం ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ ఏవంటే?
ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ ఊహించని మలుపులతో ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగుతుంటాయి. మలయాళంలో రిలీజై పెద్ద విజయాన్ని సాధించిన కొన్ని ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ సినిమాలు ఏవంటే?
(1 / 5)
టొవినో థామస్ హీరోగా నటించిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ అన్వేషిప్పిన్ కండేతుమ్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఓటీటీలో బిగ్గెస్ట్ సక్సెస్‌గా నిలిచింది. రెండు మర్డర్ కేసులను తన తెలివితేటలతో ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా సాల్వ్ చేశాడన్నదే అన్వేషిప్పిన్ కండేతుమ్ కథ.
(2 / 5)
టొవినో థామస్, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళం మూవీ ఫోరెన్సిక్ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ సీరియల్ కిల్లర్‌ను ఫోరెన్సిక్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడన్నదే ఈ మూవీ కథ.
(3 / 5)
పోలీసులను టార్గెట్ చేసిన ఓ సీరియల్ కిల్లర్ కథతో రూపొందిన మిడ్‌నైట్ మర్డర్స్ మూవీ ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. తెలుగులో ఆహా ఓటీటీలో రిలీజైన ఈ మలయాళం డబ్బింగ్ మూవీలో కుంచకోబోబన్ హీరోగా నటించాడు.
(4 / 5)
పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన మలయాళం మూవీ కోల్డ్ కేస్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈసినిమా అదే పేరుతో ఆహా ఓటీటీలో రిలీజైంది. ఓ హత్య కేసును పోలీస్ ఆఫీసర్‌తో పాటు మరో జర్నలిస్ట్ ఎలా సాల్వ్ చేసిందన్నదే ఇంట్రెస్టింగ్‌గా డైరెక్టర్ ఈ మూవీలో చూపించాడు.
(5 / 5)
గత ఏడాది మలయాలంలో బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా కన్నూర్ స్క్వాడ్ మూవీ నిలిచింది. మమ్ముట్టి హీరోగా నటించిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా తెలుగు ఓటీటీ ఫ్యాన్స్ ముందుకొచ్చింది. ఓ పొలిటికల్ లీడర్ మర్డర్ కేసును తన టీమ్‌తో కలిసి నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ ఎలా సాల్వ్ చేశాడన్నది కన్నూర్ స్వ్యాడ్ మూవీ కథ.
ఇతర గ్యాలరీలు