తెలుగు న్యూస్ / ఫోటో /
గేమ్స్ ఆడే వారి కోసం ప్రత్యేకమైన Ambrane Dots Play ఇయర్‌బడ్స్, ధర తక్కువే!
వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లకు సంబంధించి మార్కెట్‌లో ఎన్నో రకాల బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటికీ భిన్నంగా, ప్రత్యేకించి మొబైల్, కంప్యూటర్ గేమ్స్ ఆడేవారి కోసం కోసం ఆంబ్రేన్ కంపెనీ 'ఆంబ్రేన్ డాట్స్ ప్లే' పేరుతో TWS (ట్రూలీ వైర్‌లెస్ స్టీరియో) పరికరాలను ప్రవేశపెట్టింది.

(1 / 6)
ఆంబ్రేన్ డాట్స్ ప్లే ఇయర్‌బడ్స్ తమ బ్రాండ్ నుంచి బడ్జెట్ సెగ్మెంట్లోనే ఉంటుంది. గేమింగ్ ఔత్సాహికులకు అనుకూలంగా ఇందులో తక్కువ అల్ట్రా లేటెన్సీ రేట్, ఎక్కువ ఆక్యూరసీ రేట్ ఉంటుంది.(Ambrane)
(2 / 6)
కొత్త ఆంబ్రేన్ TWS 46ms అల్ట్రా-లేటెన్సీ రేట్‌ను కలిగి ఉంది. LED లైట్‌లతో బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్ బాడీలో ఆకర్షణీయంగా ఉంది. కనెక్టివిటీ కోసం ఇందులో బ్లూటూత్ వెర్షన్ 5.1ని కలిగి ఉంది.(Ambrane)
(3 / 6)
ఈ ఆంబ్రేన్ డాట్స్ ప్లే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 19 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయని కంపెనీ పేర్కొంది. ప్లే టైమ్ 6 గంటల వరకు ఉంటుంది. ఇవి పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 1.5 గంటలు పడుతుంది.(Ambrane)
(4 / 6)
అంబ్రేన్ డాట్స్ ప్లే TWS పాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో 13mm డ్రైవర్లను కలిగి ఉంది. అలాగే ఇవి వాటర్ రెసిస్టెంట్ కూడా. కంపెనీ ఈ ఇయర్‌బడ్‌లపై 365 రోజుల వారంటీని అందిస్తుంది.(Ambrane)
ఇతర గ్యాలరీలు