AP DSC TET Exams : ఏపీ డీఎస్సీ, టెట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రిపరేషన్ కు 90 రోజుల సమయం, త్వరలో కొత్త తేదీల ప్రకటన!-amaravati ap tet dsc preparation time extended to 90 days new exam dates announced ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Dsc Tet Exams : ఏపీ డీఎస్సీ, టెట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రిపరేషన్ కు 90 రోజుల సమయం, త్వరలో కొత్త తేదీల ప్రకటన!

AP DSC TET Exams : ఏపీ డీఎస్సీ, టెట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రిపరేషన్ కు 90 రోజుల సమయం, త్వరలో కొత్త తేదీల ప్రకటన!

Jul 03, 2024, 05:43 PM IST Bandaru Satyaprasad
Jul 03, 2024, 05:43 PM , IST

  •  AP DSC TET Exams : ఏపీ మెగా డీఎస్సీ, టెట్ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో టెట్ కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. త్వరలో కొత్త తేదీలు విడుదల చేయనున్నారు.

ఏపీ మెగా డీఎస్సీ, టెట్ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో టెట్ కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

(1 / 6)

ఏపీ మెగా డీఎస్సీ, టెట్ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో టెట్ కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. (pexels)

త్వరలోనే డీఎస్సీ, టెట్ కొత్త తేదీలు ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే మొత్తం ప్రక్రియ 6 నెలల్లోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. 

(2 / 6)

త్వరలోనే డీఎస్సీ, టెట్ కొత్త తేదీలు ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే మొత్తం ప్రక్రియ 6 నెలల్లోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. (pexels)

ఈ ఏడాది బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారికి మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీకి అనుగుణంగా మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 

(3 / 6)

ఈ ఏడాది బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారికి మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీకి అనుగుణంగా మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. (pexels)

టెట్‌, మెగా డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు మరింత సమయం కావాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు, పలువురు ఎమ్మెల్సీలు మంత్రి లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై మంత్రి లోకేశ్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. 

(4 / 6)

టెట్‌, మెగా డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు మరింత సమయం కావాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు, పలువురు ఎమ్మెల్సీలు మంత్రి లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై మంత్రి లోకేశ్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. (pexels)

మంత్రి లోకేశ్ ఆదేశాలతో టెట్‌కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు  అధికారిక వర్గాలు తెలిపాయి. 

(5 / 6)

మంత్రి లోకేశ్ ఆదేశాలతో టెట్‌కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు  అధికారిక వర్గాలు తెలిపాయి. (pexels)

ఈ ఏడాది డిసెంబర్‌లోపు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేశ్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది.  

(6 / 6)

ఈ ఏడాది డిసెంబర్‌లోపు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేశ్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది.  (Pixels)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు