తెలుగు న్యూస్ / ఫోటో /
అక్షయ నవమి అంటే అక్షయ తృతీయతో సమానం.. ఉసిరి చెట్టు కింద ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం
- Akshaya Navami : అక్షయ నవమిని ఉసిరి నవమి అని కూడా అంటుంటారు. ఈ రోజున ఇంట్లోని ఆర్థిక సంక్షోభం, వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
- Akshaya Navami : అక్షయ నవమిని ఉసిరి నవమి అని కూడా అంటుంటారు. ఈ రోజున ఇంట్లోని ఆర్థిక సంక్షోభం, వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
(1 / 6)
హిందూ మతంలో అక్షయ నవమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజును ఉసిరి నవమి అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి ఉసిరి చెట్టు కింద పూజలు చేస్తారు. అక్షయ నవమి అంటే అక్షయ తృతీయతో సమానం. ఈ రోజు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు. అక్షయ నవమి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే నిత్య ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.
(2 / 6)
అక్షయ నవమి ఉపవాసం ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున జరుపుకొంటారు. ఈ రోజును ఉసిరి నవమి అని కూడా అంటారు. ఈ ఏడాది నవంబర్ 10న అక్షయ నవమి. అక్షయ నవమి రోజున విష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఉసిరి చెట్టును కూడా పూజిస్తారు. పురాణాల ప్రకారం సత్యయుగం ఈ రోజున ప్రారంభమైంది.
(4 / 6)
అక్షయ నవమి రోజున రహస్య దానధర్మాలు చేయడం ప్రత్యేకమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రోజున ఉసిరి చెట్టు కింద పూజ చేసి, ఉసిరికాయను బుట్టలో వేసి బ్రాహ్మణులకు దానం చేయండి. ఉసిరికాయను చెట్టు కింద తినాలి. ఇది ఇంటిలో ఆనందం, శ్రేయస్సును పెంచుతుంది. ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. అక్షయ నవమి రోజున ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉసిరి చెట్టును నాటడం మంచిది. దీంతో ఇంటి వాస్తుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
(5 / 6)
ఉసిరి నవమి నాడు ఉసిరి చెట్టు మూలంలో ఒక నాణెం పెట్టండి. ఇది చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల వ్యక్తి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని. లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు.
ఇతర గ్యాలరీలు