Bollywood: ‘బడే మియా చోటే మియా’ ట్రైలర్ లాంచ్‍లో అక్షయ్, టైగర్ ష్రాఫ్ హంగామా.. గ్లామరస్‍గా మానుషి, అలయా
- Bade Miyan Chote Miyan Trailer Launch: బడే మియా చోటే మియా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (మార్చి 26) జరిగింది. ఈ ఈవెంట్‍కు హీరోలు అక్షయ్ కుమార్, టైగరా ష్రాఫ్ సహా మూవీ టీమ్ సభ్యులు హాజరయ్యారు. ఆ ఫొటోలు ఇవే.
- Bade Miyan Chote Miyan Trailer Launch: బడే మియా చోటే మియా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (మార్చి 26) జరిగింది. ఈ ఈవెంట్‍కు హీరోలు అక్షయ్ కుమార్, టైగరా ష్రాఫ్ సహా మూవీ టీమ్ సభ్యులు హాజరయ్యారు. ఆ ఫొటోలు ఇవే.
(1 / 8)
బాలీవుడ్ మూవీ ‘బడే మియా చోటే మియా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (మార్చి 26) గ్రాండ్‍గా జరిగింది. ఈ చిత్రంలో హీరోలుగా నటించిన అక్షయ్ కుమార్, టైగార్ ష్రాఫ్ ఈ ఈవెంట్‍లో సందడి చేశారు. సరదాగా జోక్‍లు వేస్తూ కాసేపు నవ్వుకున్నారు. (AFP)
(2 / 8)
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అలయా ఎఫ్ కూడా నటిస్తున్నారు. ట్రైలర్ ఈవెంట్‍లో అలయాతో టైగర్ ష్రాఫ్ కెమెరాలకు పోజులు ఇచ్చారు. బడే మియా చోటే మియా సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.
(3 / 8)
అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్ నవ్వుతూ మెరిశారు. ఈ సినిమాతో రెండోసారి వారు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. గతంలో సామ్రాట్ పృథ్విరాజ్ మూవీలో ఈ ఇద్దరూ కలిసి నటించారు.
(4 / 8)
అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్, అలయా ఎఫ్, టైగర్ ష్రాఫ్ నలుగురు కలిసి కెమెరాలకు పోజులు ఇచ్చారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్ర చేశారు.
(5 / 8)
బడే మియా చోటే మియా మూవీ టీమ్ కలిసి ఫొటోలు దిగింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సరదాగా సాగింది. ఇద్దరు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ల చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. అక్షయ్, టైగర్ ఈ చిత్రంలో ఆఫీసర్ల పాత్ర పోషించారు. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఈ మూవీలో కీరోల్ చేశారు.
(6 / 8)
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో అక్షయ్, పృథ్విరాజ్ సుకుమారన్ కరచాలనం చేసుకున్న దృశ్యమిది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రమోషన్లను చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసింది.
(7 / 8)
బడే మియా చోటే మియా చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ముంబై, లండన్, స్కాట్‍ల్యాండ్, జోర్డాన్‍లోని లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ చేశారు.
ఇతర గ్యాలరీలు