Warangal 1000 Pillar Temple : కాకతీయుల శిల్ప సంపదకు జీవం - 'వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం' పునఃప్రారంభం-after 17 years warangal 1000 pillar temple kalyana mandapam has reopened ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Warangal 1000 Pillar Temple : కాకతీయుల శిల్ప సంపదకు జీవం - 'వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం' పునఃప్రారంభం

Warangal 1000 Pillar Temple : కాకతీయుల శిల్ప సంపదకు జీవం - 'వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం' పునఃప్రారంభం

Mar 08, 2024, 03:13 PM IST Maheshwaram Mahendra Chary
Mar 08, 2024, 03:13 PM , IST

  • Waranal 1000 Pillar Temple Kalyana Mandapam Photos : వరంగల్ నగరంలోని వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం పునఃప్రారంభమైంది. మార్చి 8వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా పునరుద్ధరించిన కల్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ప్రారంభించారు.

కాకతీయుల కళా నైపుణ్యానికి ప్రతీక వరంగల్​ నగరంలోని వేయి స్తంభాల గుడి(Warangal 1000 Pillar Temple). డెవలప్​ మెంట్​ పేరుతో 2006లో ఆలయంలోని కల్యాణ మండపాన్ని తొలగించి, పునరుద్ధరించే పనులు చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా అనుకున్న టైంలో వర్క్స్​ కంప్లీట్​ కాలేదు. దాదాపు 17 ఏళ్ల  తర్వాత పనులు పూర్తి కావటంతో మార్చి 8వ తేదీన పునఃప్రారంభించారు.

(1 / 6)

కాకతీయుల కళా నైపుణ్యానికి ప్రతీక వరంగల్​ నగరంలోని వేయి స్తంభాల గుడి(Warangal 1000 Pillar Temple). డెవలప్​ మెంట్​ పేరుతో 2006లో ఆలయంలోని కల్యాణ మండపాన్ని తొలగించి, పునరుద్ధరించే పనులు చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా అనుకున్న టైంలో వర్క్స్​ కంప్లీట్​ కాలేదు. దాదాపు 17 ఏళ్ల  తర్వాత పనులు పూర్తి కావటంతో మార్చి 8వ తేదీన పునఃప్రారంభించారు.(Union Minister G Kishan Reddy Twitter)

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పునరుద్ధరించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

(2 / 6)

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పునరుద్ధరించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.(Union Minister G Kishan Reddy Twitter)

వెయ్యి స్తంభాల గుడిలోని కల్యాణ మండపాన్ని తొలగించిన పురావస్తు శాఖ అధికారులు 2006 నుంచి 2022 వరకు, అంటే దాదాపు 16 ఏళ్ల వరకు వాటిని హనుమకొండ పద్మాక్షి ఆలయ సమీపంలో పెట్టారు. ఒకట్రెండు ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పి, దశాబ్ధంన్నరకు పైగా కాలయాపన చేశారు. కల్యాణ మండపాన్ని తొలగించిన అధికారులు.. పునరుద్ధరణ పనులను అప్పట్లో తమిళనాడుకు చెందిన స్థపతి శివకుమార్ కు అప్పగించారు. కేంద్ర పురావస్తుశాఖ నుంచి దాదాపు రూ.7.5 కోట్లు పునరుద్ధరణ పనులకు కేటాయించడంతో ఆయన పనులను మొదలు పెట్టారు. 

(3 / 6)

వెయ్యి స్తంభాల గుడిలోని కల్యాణ మండపాన్ని తొలగించిన పురావస్తు శాఖ అధికారులు 2006 నుంచి 2022 వరకు, అంటే దాదాపు 16 ఏళ్ల వరకు వాటిని హనుమకొండ పద్మాక్షి ఆలయ సమీపంలో పెట్టారు. ఒకట్రెండు ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పి, దశాబ్ధంన్నరకు పైగా కాలయాపన చేశారు. కల్యాణ మండపాన్ని తొలగించిన అధికారులు.. పునరుద్ధరణ పనులను అప్పట్లో తమిళనాడుకు చెందిన స్థపతి శివకుమార్ కు అప్పగించారు. కేంద్ర పురావస్తుశాఖ నుంచి దాదాపు రూ.7.5 కోట్లు పునరుద్ధరణ పనులకు కేటాయించడంతో ఆయన పనులను మొదలు పెట్టారు. (Union Minister G Kishan Reddy Twitter)

రెండేళ్ల కిందట ములుగు జిల్లా రామప్ప టెంపుల్(Ramappa Temple ) యునెస్కో గుర్తింపు పొందిన క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​ రెడ్డి కల్యాణ మండపం పనులపై ఆరా తీశారు. 2022 ఏప్రిల్ 26న కేంద్ర ప్రభుత్వ టూరిజం, ఇతర శాఖల అధికారులతో కలిసి వెయ్యి స్తంభాల గుడిని సందర్శించారు. కల్యాణ మండపం తిరిగి నిర్మించే బాధ్యత తనదేనని మాటిచ్చి, దాని ప్రకారం గతంలో ఖర్చయిన నిధులతో సంబంధం లేకుండా మరో రూ.15 కోట్లు మంజూరు చేశారు. ఆ తరువాత స్థపతి శివకుమార్​ ఆధ్వర్యంలో 70 మంది శిల్పులు పనులు మళ్లీ మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు నిరంతరం శ్రమించి, కల్యాణ మండపానికి రూపం తీసుకువచ్చారు. 

(4 / 6)

రెండేళ్ల కిందట ములుగు జిల్లా రామప్ప టెంపుల్(Ramappa Temple ) యునెస్కో గుర్తింపు పొందిన క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​ రెడ్డి కల్యాణ మండపం పనులపై ఆరా తీశారు. 2022 ఏప్రిల్ 26న కేంద్ర ప్రభుత్వ టూరిజం, ఇతర శాఖల అధికారులతో కలిసి వెయ్యి స్తంభాల గుడిని సందర్శించారు. కల్యాణ మండపం తిరిగి నిర్మించే బాధ్యత తనదేనని మాటిచ్చి, దాని ప్రకారం గతంలో ఖర్చయిన నిధులతో సంబంధం లేకుండా మరో రూ.15 కోట్లు మంజూరు చేశారు. ఆ తరువాత స్థపతి శివకుమార్​ ఆధ్వర్యంలో 70 మంది శిల్పులు పనులు మళ్లీ మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు నిరంతరం శ్రమించి, కల్యాణ మండపానికి రూపం తీసుకువచ్చారు. (Union Minister G Kishan Reddy Twitter)

 ఆ తరువాత స్థపతి శివకుమార్​ ఆధ్వర్యంలో 70 మంది శిల్పులు పనులు మళ్లీ మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు నిరంతరం శ్రమించి, కల్యాణ మండపానికి రూపం తీసుకువచ్చారు. 

(5 / 6)

 ఆ తరువాత స్థపతి శివకుమార్​ ఆధ్వర్యంలో 70 మంది శిల్పులు పనులు మళ్లీ మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు నిరంతరం శ్రమించి, కల్యాణ మండపానికి రూపం తీసుకువచ్చారు. (Union Minister G Kishan Reddy Twitter)

వెయి స్తంభాల గుడి కల్యాణ మండపం పున: ప్రారంభం కావటంపై ఆలయ పూజారులు. భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

(6 / 6)

వెయి స్తంభాల గుడి కల్యాణ మండపం పున: ప్రారంభం కావటంపై ఆలయ పూజారులు. భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.(Union Minister G Kishan Reddy Twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు