Aa Okkati Adakku Day 1 Collections: అల్లరి నరేశ్ సినిమాకు మంచి ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..
- Aa Okkati Adakku Day 1 Box office collections: అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాకు మంచి ఓపెనింగ్ దక్కింది. ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాలను మూవీ టీమ్ వెల్లడించింది. ఆ వివరాలివే..
- Aa Okkati Adakku Day 1 Box office collections: అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాకు మంచి ఓపెనింగ్ దక్కింది. ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాలను మూవీ టీమ్ వెల్లడించింది. ఆ వివరాలివే..
(1 / 5)
మంచి హైప్‍తో వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా బాక్సాఫీస్ వద్ద శుభారంభం చేసింది. అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఈ కామెడీ డ్రామా మూవీ మంచి ఓపెనింగ్ దక్కించుకుంది.
(2 / 5)
మూడేళ్లుగా సీరియస్ సినిమాలు చేసిన అల్లరి నరేశ్.. మళ్లీ తన మార్క్ కామెడీతో ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీ చేశారు. ఈ మూవీ మే 3న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మల్లీ అంకం దర్శకత్వం వహించారు. నరేశ్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్‍గా నటించారు.
(3 / 5)
ఆ ఒక్కటి అడక్కు సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.1.62కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (మే 4) అధికారికంగా వెల్లడించింది. లో బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రానికి ఇది మంచి ఆరంభమే.
(4 / 5)
ఆ ఒక్కటి అడక్కు మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా తొలి రోజు రూ.1.62 కోట్లు దక్కించుకోగా.. రెండో రోజు కలెక్షన్లు కాస్త పుంజుకునే అవకాశం ఉంది. సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం పోటీలో ఉన్నా.. ఈ చిత్రానికి మంచి ఆరంభమే లభించింది.
ఇతర గ్యాలరీలు