తెలుగు న్యూస్ / ఫోటో /
Land Rover Defender | దృఢమైన డిజైన్, విశాలమైన క్యాబిన్.. 8 సీట్ల ల్యాండ్ రోవర్!
- ప్రీమియం ఆటోమొబైల్ తయారుదారు ల్యాండ్ రోవర్ తమ బ్రాండ్ నుంచి సరికొత్త 2023 Land Rover Defender 130 SUVని ఆవిష్కరించింది. కలర్స్ పరంగా సెడోనా రెడ్ అలాగే ఎక్స్‌టెండెడ్ బ్రైట్ పెయింట్‌వర్క్‌తో ఈ వాహనం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
- ప్రీమియం ఆటోమొబైల్ తయారుదారు ల్యాండ్ రోవర్ తమ బ్రాండ్ నుంచి సరికొత్త 2023 Land Rover Defender 130 SUVని ఆవిష్కరించింది. కలర్స్ పరంగా సెడోనా రెడ్ అలాగే ఎక్స్‌టెండెడ్ బ్రైట్ పెయింట్‌వర్క్‌తో ఈ వాహనం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
(1 / 6)
ల్యాండ్ రోవర్ తాజాగా మూడు-వరుసలలో ఎనిమిది-సీట్లు కలిగిన పొడవాటి డిఫెండర్ 130 SUVని విడుదల చేసింది. వాహనం చూడటానికి ఎంతో దృఢంగా ఉంది. ఇంటీరియర్ మిగతా వాటితో పోలిస్తే మరింత విశాలంగా ఉంది. ఈ వాహనం ఎలాంటి దారుల్లోనైనా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. UKలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 వాహనం £73,895 ఆన్-రోడ్ ధరతో ఆవిష్కరించారు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 72 లక్షలు.
(2 / 6)
సరికొత్త ల్యాండ్ రోవర్ న్యూ డిఫెండర్ 130 X- ఎడిషన్‌తో పాటు X-డైనమిక్, SE, HSE అనే నాలుగు వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది.
(3 / 6)
ఇంజన్ కాన్ఫిగరేషన్ల పరంగా డిఫెండర్ 130 వాహనం రెండు ఎలక్ట్రిఫైడ్ వెర్షన్లు P300, P400 లేదా రెండు మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ వెర్షన్లు అయినటువంటి D250, D300 6-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌లలో లభిస్తుంది.
(4 / 6)
ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 లోపలి భాగంలో 11.4-అంగుళాల Pivi ప్రో టచ్‌స్క్రీన్, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్లస్ సిస్టమ్ అలాగే స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్ ఉన్నాయి.
(5 / 6)
2023 ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 వాహనంలోని అన్ని వేరియంట్‌లలో ఇంటెలిజెంట్ ఆల్-వీల్ డ్రైవ్ (iAWD) సిస్టమ్‌తో పాటు 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా ఉంటుంది.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు