Tirumala Tour Package : హైదరాబాద్ టు తిరుమల - ఫ్రీగా శ్రీవారి శీఘ్రదర్శనం, చాలా తక్కువ ధరలో టూర్ ప్యాకేజీ..!
- Telangana Tourism Tirumala Tour Package: తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్లాన్ లో ఉన్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే టూర్ ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. టీజీ టూరిజం వెబ్ సైట్ నుంచి బుకింగ్ చేసుకోవాలి.
- Telangana Tourism Tirumala Tour Package: తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్లాన్ లో ఉన్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే టూర్ ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. టీజీ టూరిజం వెబ్ సైట్ నుంచి బుకింగ్ చేసుకోవాలి.
(1 / 6)
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తెలంగాణ టూరిజం అద్భుతమైన టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. తక్కువ సమయంలోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. నిర్దిష్ట సమయంలోపు వెళ్లి దర్శనం చేసుకోవాలనుకునేవారికి ఈ ప్యాకేజీ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు.
(2 / 6)
కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ టూర్ ప్యాకేజీ పూర్తి అవుతుంది. దీన్ని తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తుంది. బస్సులోనే వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి జర్నీ ప్రారంభమవుతుంది.
(3 / 6)
తిరుమల టూర్ ప్యాకేజీ ధరలు : పెద్దలకు రూ. 3,700గా ఉంది. ఇక చిన్నారులకు రూ. 2,960గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది.
(4 / 6)
తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే… TIRUPATI - TIRUMALA TOUR పేరుతో ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది. కేవలం ఒకే ఒక్క రోజులోనే తిరుపతి, తిరుమల, తిరుచానూర్ కవర్ అవుతాయి. టూర్ షెడ్యూల్ ప్రకారం… సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయల్దేరుతుంది. (సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9848540374). రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. ఆ తర్వాత స్థానికంగా ఉండే ఆలయాలను చూస్తారు. తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. అనంతరం తిరుపతికి చేరుకుంటారు.
(5 / 6)
శ్రీవారి దర్శనం తర్వాత… తిరుపతికి చేరుకుంటారు. ఇక్కడ ఫ్రెషప్ అవుతారు. సాయంత్రం 5 గంటలకు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మూడో రోజు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ఈ ప్యాకేజీలో టిక్కెట్లు బుక్ చేసుకున్న యాత్రికులందరూ తెలంగాణ టూరిజం బస్సులో మాత్రమే ప్రయాణించాలి. సొంత వాహనాల్లో వచ్చి దర్శన టికెట్లు కోసం రిపోర్ట్ చేస్తే టీటీడీ అధికారులు తిరస్కరిస్తారు. మీ డబ్బులు వాపస్ కూడా ఇవ్వబడవు.
ఇతర గ్యాలరీలు