Riots in Brussels : బెల్జియం ఓటమితో ఫ్యాన్స్​ ఆగ్రహం.. బ్రసెల్స్​లో విధ్వంసం!-world cup riots in brussels after morocco beat belgium ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  World Cup Riots In Brussels After Morocco Beat Belgium

Riots in Brussels : బెల్జియం ఓటమితో ఫ్యాన్స్​ ఆగ్రహం.. బ్రసెల్స్​లో విధ్వంసం!

బ్రసెల్స్​లో చెలరేగిన హింస
బ్రసెల్స్​లో చెలరేగిన హింస (AP)

World cup riots in Brussels : ఫిఫా వరల్డ్​ కప్​లో.. మొరాకో చేతిలో బెల్జియం ఓటమిని ఆ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగా.. బ్రసెల్స్​ రోడ్ల మీదకొచ్చి హింసకు తెగబడ్డారు.

World cup riots in Brussels : 2022 ఫిఫా వరల్డ్​ కప్​లో ఊహించిన పరిణామం ఎదురవడంతో బెల్జియం ఫ్యాన్స్​ ఆగ్రహం కట్టలు తెంచుకుంది! ఖతార్​ వేదికగా జరుగుతున్న ఫుట్​బాల్​ వరల్డ్​ కప్​లో.. బెల్జియంపై మొరాకో 2-0 తేడాదో గెలుపొందడం.. ఆ దేశ ప్రజలకు మింగుడుపడలేదు. ఫలితంగా బ్రసెల్స్​వాసులు.. నగరంలో విధ్వంసం సృష్టించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు.

ట్రెండింగ్ వార్తలు

రోడ్ల మీదకొచ్చి..

మ్యాచ్​ ముగిసే సమయానికన్నా ముందే బ్రసెల్స్​లో హింస చెలరేగింది. పదుల సంఖ్యలో ప్రజలు.. హుడీలు ధరించి రోడ్ల మీదకొచ్చారు. దుకాణాల అద్దాలు పగలగొట్టారు. వాహనాలకు నిప్పంటించారు. ఎలక్ట్రిక్​ వాహనాలు కూడా తగలబడ్డాయి. టపాసులు పేల్చి.. బెల్జియం జట్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్రలు, రాడ్లు పట్టుకుని బ్రసెల్స్​ వీధుల్లో పరుగులు తీశారు. కనిపించిన వస్తువును.. ముందు వెనక చూసుకోకుండా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్టు గాయపడినట్టు తెలుస్తోంది.

బ్రసెల్స్​ వీధుల్లో ఉద్రిక్తత
బ్రసెల్స్​ వీధుల్లో ఉద్రిక్తత

Beligum vs morocco : బ్రసెల్స్​లో పరిస్థితులను అదుపు చేసేందుకు అక్కడి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వందలాది మంది పోలీసులు.. రోడ్ల మీదకు చేరి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. హింసను సృష్టిస్తున్న వారిని నియంత్రించే ప్రయత్నం చేశారు. బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 15మందికిపైగా ప్రజలను పోలీసులు అరెస్ట్​ చేశారు.

స్థానిక కాలమానం ప్రకారం.. రాత్రి 7 గంటలు దాటిన తర్వాత.. బ్రసెల్స్​లో పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

"ఈ ఘటనను నేను ఖండిస్తున్నాను. పోలీసులు జోక్యం చేసుకుని, పరిస్థితిని అదుపు చేశారు. అభిమానులు నగరంలో తిరగొద్దని సూచిస్తున్నాను. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలి. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్​ చేయాలని పోలీసులుకు ఆదేశాలిచ్చాను," అని బ్రసెల్స్​ మేయర్​ ఫిలిప్​ క్లోజ్​ ట్వీట్​ చేశారు.

నిరసనకారుడు
నిరసనకారుడు

బ్రెజిల్​లో దాదాపు 5లక్షల మంది మొరాకో దేశానికి చెందిన వారు నివాసముంటున్నారు.

Fifa world cup 2022 : లీగే నగరంలో కూడా హింస చెలరేగింది. 50మంది ప్రజలు.. ఓ పోలీస్​ స్టేషన్​పై దాడి చేశారు. అద్దాలు పగలగొట్టి.. రెండు వాహనాలను ధ్వంసం చేశారు. వారిని తరిమి కొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు.

నెథర్​ల్యాండ్​లో కూడా..!

నెథర్​ల్యాండ్​లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొరాకో విజయంతో సంబరాలు చేసుకుంటున్న ప్రజలపై పోలీసులు లాఠీ ఛార్జ్​ చేశారు. హాగ్వే, అమ్​స్టర్​డామ్​, ఉట్రెచ్​ నగరాల్లో పలువురు గాయపడ్డారు.

Riots in Belgium latest updates : రోటర్​డ్యామ్​లో సిటీ సెంటర్​ వద్ద 500మంది గుమిగుడారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్​కు యత్నించగా.. ఫ్యాన్స్​ తిరగబడ్డారు. పోలీసులపై టపాసులు, గాజులు విసిరారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

WhatsApp channel

సంబంధిత కథనం