Car chase in New York : ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ తరహా 'ఛేజ్'​.. వీడియో వైరల్​!-viral video of fast furious chase in new york streets mercedes chases rams toyota ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Viral Video Of Fast & Furious Chase In New York Streets - Mercedes Chases, Rams Toyota

Car chase in New York : ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ తరహా 'ఛేజ్'​.. వీడియో వైరల్​!

Sharath Chitturi HT Telugu
Sep 06, 2022 07:35 AM IST

Car chase scene in New York : న్యూయార్క్​ వీధుల్లో ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ సినిమా రేంజ్​లో ఓ యాక్షన్​ ఛేజింగ్​ సీన్​ చోటుచేసుకుంది. ఓ కారు, మరో కారును వెంబడించి ఢీకొట్టింది. చివరికి ఏమైందంటే..

ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ తరహా 'ఛేజ్'​.. వీడియో వైరల్​!
ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ తరహా 'ఛేజ్'​.. వీడియో వైరల్​! (Twitter)

Car chase scene in New York : అమెరికా న్యూయార్క్​ వీధుల్లో ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ సినిమా తరహా ఛేజింగ్​ సీన్​ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఘటన శనివారం జరిగినట్టు తెలుస్తోంది. ఓ బ్లాక్​ మెర్సిడీస్​ కారు.. ఓ టయోటా ఆర్​ఏవీ4ని ఢీకొట్టింది. మెర్సిడీస్​ నుంచి తప్పించుకునేందుకు టయోటా కారు విపరీతంగా ప్రయత్నించింది. కానీ మెర్సిడీస్​ కారు.. టయోటా కారును పలుమార్లు ఢీకొట్టింది. అచ్చం సినిమాల్లో ఛేజింగ్​ సీన్లు చూపించినట్టుగానే శబ్ధాలు వచ్చాయి.

చివరికి.. టయోటా కారు ఆగిపోయింది. ఈ క్రమంలో బ్లాక్​ మెర్సిడీస్​ కారులో నుంచి దిగిన ఓ యువకుడు.. టయోటా కారు అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత.. డ్రైవర్​ నుంచి ఓ బ్యాగు లాగేసుకుని, మెర్సిడీస్​ కారులో అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

ఈ ఘటనను అక్కడే ఉన్న స్థానికుడు తన ఫోన్​లో చిత్రీకరించాడు. "అతని వద్ద గన్​ ఉంది. అతని వద్ద గన్​ ఉంది," అంటూ.. ఓ వ్యక్తి అరవడం వీడియోలో రికార్డు అయ్యింది.

ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనానికి గురైన బ్యాగులో 20వేల డాలర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరిని అరెస్ట్​ చేయలేదు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి:

IPL_Entry_Point

సంబంధిత కథనం