Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభం.. ప్రక్రియ ఇలా..-vice president election 2022 begins all you need to know about the process ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభం.. ప్రక్రియ ఇలా..

Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభం.. ప్రక్రియ ఇలా..

Sharath Chitturi HT Telugu
Aug 06, 2022 10:09 AM IST

Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు.. ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నిక ప్రక్రియ వివరాలు..

ఉపరాష్ట్రపతి అభ్యర్థులు వీరే..
ఉపరాష్ట్రపతి అభ్యర్థులు వీరే.. (HT)

Vice President Election 2022: దేశ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు సిద్ధపడ్డాయి. పార్లమెంట్​ హౌజ్​లో.. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు సాగనున్న ఎన్నికలో.. ఎంపీలు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. ఎన్​డీఏ అభ్యర్థి జగ్​దీప్​ ధనఖడ్​, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరేట్​ అల్వాలు ఎన్నిక బరిలో ఉన్నారు.

ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఇలా.

ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్​ కొలేజ్​ ఎన్నుకుంటుంది. ఈ ఎలక్టోరల్​ కొలేజ్​లో లోక్​సభ, రాష్ట్రసభ సభ్యులు ఉంటారు. ప్రొపోర్షనల్​ రిప్రెజెంటేషన్​ సిస్టమ్​, సింగిల్​ ట్రాన్స్​ఫరెబుల్​ ఓట్​ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. అంటే.. బ్యాలెట్​ పేపర్​లో అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఎంపీలు.. వారు ఎవరికి మద్దతిస్తున్నారో.. వరుస సంఖ్యలో ఓటు వేయాలి. ఎన్నిక కోసం సీక్రెట్​ బ్యాలెట్​ను ఉపయోగిస్తారు.

రాష్ట్రపతి ఎన్నికలో నామినేటెడ్​ సభ్యులు ఓటు వేయలేరు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికలో వారు ఓట్లు వేయవచ్చు. వారి ఓట్లు చెల్లుతాయి.

ఎలక్టోరల్​ కొలేజ్​ సభ్యులు..

  • రాజ్యసభ- 233, నామినేటెడ్​- 12
  • లోక్​సభ- 543, నామినేటెడ్​- 2
  • మొత్తం- 790

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి పేరు 20మందిని ఎలక్టోరల్​ సభ్యులు ప్రతిపాదించాలి. మరో 20మంది.. ఆ పేరుకు మద్దతు పలకాలు. అదే సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేయాలని అనుకుంటే.. రూ .15వేల డిపాజిట్​ చేయాల్సి ఉంటుంది.

ఉపరాష్ట్రపతి ఎవరు అవ్వొచ్చు?

భారత పౌరసత్వం ఉండి, 35ఏళ్ల దాటిన వ్యక్తి ఉపరాష్ట్రపతిగా పోటీ చేయవచ్చు. భారత ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వం నుంచి లబ్ధిపొందుతున్న వారైతే.. ఎన్నికలో పోటీ చేయలేరు.

ధన్​ఖడ్​ గెలుపు లాంఛనమే..!

Jagdeep Dhankhar : ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్​డీఏ అభ్యర్థి జగ్​దీప్​ ధన్​ఖడ్​ గెలుపు లాఛనమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంకెల బలం కూడా ధన్​ఖడ్​వైపే ఉంది.

రాజ్యసభలో 8 సీట్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. 36మంది టీఎంసీ ఎంపీలు దూరంగా ఉండనున్నారు. ఫలితంగా ఈసారి 744 ఎంపీలు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ 744మందిలో 441 ఎంపీలు ఎన్​డీఏకు చెందినవారే. వీరిలో ఒక్క బీజేపీ నుంచే 394మంది ఉన్నారు. వీరితో పాటు ఐదుగురు నామినేటెడ్​ సభ్యులు ఎన్​డీఏవైపే నిలబడ్డారు. వీరే కాకుండా.. వైసీపీ, బీజేడీ, బీఎస్​పీ, టీడీపీ వంటి పార్టీల నుంచి ధన్​ఖడ్​కు మద్దతు ఉంది. క్రాస్​ ఓటింగ్​ జరిగితే.. ధన్​ఖడ్​కు మరిన్ని ఓట్లు పెరుగుతాయి.

ఇక మార్గరేట్​ అల్వాకు 200 వరకు ఓట్లు లభించే అవకాశం ఉంది. కాంగ్రెస్​, డీఎంకే, టీఆర్​ఎస్​, ఆర్​జేడీ, ఎన్​సీపీ, ఎస్​పీ పార్టీలు ఆమె వెనకున్నాయి.

సాయంత్రం ఓటింగ్​ ముగిసిన వెంటనే.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. రాత్రి నాటికి.. ఫలితాలు వెలువడతాయి.

ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఈ నెల10తో ముగియనుంది. 11న నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం