Parliament session : షెడ్యూల్ కన్నా ముందే.. పార్లమెంట్ సమావేశాలకు ముగింపు!
Parliament monsoon session : సోమవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. 12వ తేదీ వరకు సమావేశాలు జరగాల్సి ఉంది.
Parliament monsoon session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను.. షెడ్యూల్ కన్నా ముందే ముగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం లేదా బుధవారంతో సమావేశాలకు ముగింపు పలకాలని భావిస్తున్నట్టు సమాచారం.
జులై 18న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను.. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న ముగించాల్సి ఉంది. అయితే.. వచ్చే వారంలో రెండు రోజులు సెలవులు(ముహ్హరం, రక్షాబంధన్) ఉన్నాయి. ఈ లెక్కన.. ఉభయ సభలకు ఇంకా మూడు వర్కింగ్ డేలు ఉన్నట్టు! అందువల్ల.. ఈ నెల 8,10న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ముగించాలని కేంద్రం భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు విపక్షాలకు కూడా నోటీసులు అందినట్టు పేర్కొన్నాయి.
వాస్తవానికి.. పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి.. విపక్షాల నిరసనలతో కార్యకలాపాలు సరిగ్గా జరగలేదు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయానికి ఇది కూడా ఓ కారణంగా తెలుస్తోంది.
మరోవైపు విపక్షాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. సోమవారం తొలి భాగంలో రాజ్యసభ కార్యకలాపాలు సాగకపోవచ్చు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వీడ్కోలు పలికేందుకు.. రాజ్యసభలో సోమవారం జరగాల్సిన క్వశ్చన్ హవర్, జీరో హవర్ను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది. రెండో భాగంలో.. పలు బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం ఈ నెల 10న ముగియనుంది. శనివారం నూతన ఉపరాష్ట్రపతి కోసం ఎన్నిక జరగనుంది.
సంబంధిత కథనం