Yogi Adityanath on Ram Mandir : ‘రామ మందిర నిర్మాణం.. 50శాతం పూర్తి’-up cm adityanath shares update on ayodhya ram mandir says 50 completed ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Yogi Adityanath On Ram Mandir : ‘రామ మందిర నిర్మాణం.. 50శాతం పూర్తి’

Yogi Adityanath on Ram Mandir : ‘రామ మందిర నిర్మాణం.. 50శాతం పూర్తి’

Sharath Chitturi HT Telugu
Oct 07, 2022 07:35 AM IST

Yogi Adityanath on Ram Mandir : అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్​ ఇచ్చారు యోగి ఆదిత్యనాథ్​. పనులు 50శాతం పూర్తైనట్టు వివరించారు.

<p>యోగి ఆదిత్యనాథ్​</p>
యోగి ఆదిత్యనాథ్​ (HT_PRINT/file)

Yogi Adityanath on Ram Mandir construction : అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న రామ మందిర నిర్మాణం పనులు 50శాతం పూర్తయ్యాయి! ఈ విషయాన్ని.. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ వెల్లడించారు.

గురువారం రాజస్థాన్​కు వెళ్లిన యోగి ఆదిత్యనాత్​.. శ్రీ పంచ్​ఖండ్​ పీఠ్​లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

"రాముడికి మందిరం కావాలన్న కల 1949 నుంచి ఉంది. దానికి తగ్గట్టుగానే ఈరోజున.. అయోధ్య రామ మందిర నిర్మాణం పనలు 50శాతం పూర్తయ్యాయి," అని ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ అన్నారు.

ఈ నేపథ్యంలో పంచ్​ఖండ్​ పీఠ్​పై పలు వ్యాఖ్యలు చేశారు.

Ayodhya Ram mandir : "మహాత్మ రామ్​చంద్ర వీర్​ జీ మహరాజ్​, స్వామి ఆచార్య ధర్మేంద్ర జీ మహరాజ్​లు దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. ప్రజల సంక్షేమం కోసం ఈ పీఠం కూడా చాలా కృషి చేసింది," అని యోగి ఆదిత్యనాథ్​ స్పష్టం చేశారు.

సంత్​ సంగం అనే కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. భారత దేశ సనాతన ధర్మం చాలా గొప్పదని, గో మాత రక్షణకు మనం చాలా విలువనిస్తామని తెలిపారు.

ఆయోధ్య రామ మందిర నిర్మాణం..

Ayodhya Ram mandir construction : రామ జన్మభూమి కేసులో 2019 నవంబర్​ 9న చారిత్రక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. 2.77 ఎకరాల్లో వివాదాస్పద భూమిని రామ జన్మభూమి ట్రస్ట్​కు అప్పగించింది. ఫలితంగా అక్కడ మందిరం రానుంది.

రామ జన్మభూమిలో గర్భ గుడి నిర్మాణం కోసం ఈ ఏడాది జూన్​లో శంకుస్థాపన చేశారు ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​. ఇక 2020 ఆగస్టు 5న.. భూమి పూజ నిర్వహించి ఆలయ పనులను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

2024 తొలి భాగం నాటికి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. నిర్మాణం కోసం భారీగా ఖర్చులు చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం