Usha Vance TANA : ఉషా వాన్స్​పై మాగా జాతి వివక్ష వ్యాఖ్యలు- ఖండించిన తానా-under fire from maga usha vance gets huge supprt from tana ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Usha Vance Tana : ఉషా వాన్స్​పై మాగా జాతి వివక్ష వ్యాఖ్యలు- ఖండించిన తానా

Usha Vance TANA : ఉషా వాన్స్​పై మాగా జాతి వివక్ష వ్యాఖ్యలు- ఖండించిన తానా

Sharath Chitturi HT Telugu
Jul 26, 2024 08:10 AM IST

Usha Vance latest news : రిపబ్లికెన్​ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్​ భార్య ఉషా వాన్స్​పై మాగా జాతి వివక్ష వ్యాఖ్యలు చేసింది. వీటిని తానా తీవ్రంగా ఖండించింది.

రిపబ్లికెన్​ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్​- సతీమణి ఉషా వాన్స్​
రిపబ్లికెన్​ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్​- సతీమణి ఉషా వాన్స్​ (AP)

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికెన్​ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్​ని ఎన్నుకున్నప్పటి నుంచి ఆయన సతీమణి, భారత సంతతి ఉషా చిలుకూరి వాన్స్​ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కాగా ఆమెపై మాగా (మేక్​ అమెరికా గ్రేట్​ అగైన్​) సభ్యులు చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలను తానా (తెలుగు అసోసియేషన్​ ఆఫ్​ నార్త్​ ఆమెరికా) తాజాగా ఖండించింది.

"ఇలాంటి జాతి వివక్ష వ్యాఖ్యలు అమోదయోగ్యం కాదు. వీటిని ఖండిస్తున్నాము. ఉషా వాన్స్​కు మేము మద్దతుగా నిలుస్తున్నాము. ఆమెపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాము," అని తానా అధ్యక్షుడు నిరంజన్​ శృంగవరపు తెలిపారు.

అమెరికాలో పార్టీలకు మద్దతు ఇచ్చే విషయంపై అగ్రరాజ్యంలోని తెలుగు సమాజం ఎప్పుడు రెండుగా చీలిపోతుంది! ఓటు హక్కు లేని విద్యార్థులు, ఉద్యోగులు డెమొక్రాట్లకు మద్దతుగా నిలుస్తారు. ఆ పార్టీ ఇమ్మిగ్రేషన్​ పాలసీలు ఇందుకు కారణం. కానీ వ్యాపారులు, గ్రీన్​కార్డు హోల్డర్లు రిపబ్లికెన్లకు మద్దతిస్తారు.

ఇక ఇప్పుడు ఇద్దరు భారత సంతతి మహిళలు (డెమొక్రాట్​ అభ్యర్థి రేసులో ఉన్న కమలా హారిస్​- ఉషా వాన్స్​) మధ్య ఒకరిని ఎంచుకోవడం తెలుగు సమాజానికి మరింత కఠినంగా మారింది. ఈ సమయంలో మాగా వంటి సంస్థలు ఉషా వాన్స్​పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం తెలుగు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

"ఏ దేశానికి చెందినవారు అన్న విషయంతో సంబంధం లేకుండా.. వ్యక్తులపై జరిగే జాతి వివక్ష దాడులను మేము ఖండిస్తాము. ఉషా ఒక తెలుగు మహిళగా కాకుండా.. భారత సంతతి వ్యక్తిగా పరిగణించి, మేము గర్వంగా ఉంటాము," అని తానా మాజీ అధ్యక్షుడు మోహన్​ నన్నపనేనీ అన్నారు.

భారతీయుల మద్దతు రిపబ్లికెన్లు, డెమొక్రటిక్​లకు సమానంగా ఉంటుందని, అందుకే ఉషా వాన్స్​పై జరిగిన జాతి వివక్ష దాడిని ఎన్నికలకు లింక్​ పెట్టకూడదని మోహన్​ అన్నారు. ఇంకా చెప్పాలంటే, రిపబ్లికెన్లు అధికారంలోకి వచ్చినప్పుడే ఎందరో భారతీయులు లబ్ధిపొందారని ఆయన అన్నారు.

"మెరిట్స్​, డీమెరిట్స్​పైనే ఎన్నికలు ఆధారపడాలి. జాతి వివక్ష జోలికి వెళ్లకూడదు. ఇంకా చెప్పాలంటే, ఇలాంటి వ్యాఖ్యలతో ఓట్లు ఎక్కువపడటం జరగదు," అని మోహన్​ తెలిపారు.

"నేను ఒక భారతీయ అమెరికన్​ని. ఉషా వాన్స్​పై వచ్చిన జాతి వివక్ష ఆరోపణలను ఖండిస్తున్నాను. వలసవాద కుటుంబం నుంచి వచ్చిన ఉషా వాన్స్​ ప్రయాణం అమెరికా భిన్నత్వానికి, ఐకమత్యానికి చిహ్నం," అని తానా మాజీ సెక్రటరీ అశోక్​ కొల్ల అన్నారు. ఉషా వాన్స్​పై చేసిన జాతి వివక్ష ఆరోపణలు నిరాధారణమని తేల్చిచెప్పారు.

జేడీ వాన్స్​ కేరీర్​ని ఉషా తీవ్రస్థాయిలో ప్రభావితం చేశారని మాగా సభ్యులు భావిస్తున్నారు. ఫలితంగా రిపబ్లికెన్​ పార్టీ ఇమ్మిగ్రేషన్​ విధానాలు మారిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"ఎవరు ఈ జేడీ వాన్స్​? భారతీయ భార్య, వివేక్​ అనే పేరుతో ఉన్న కొడుకుతో ఆయన అమెరికాకు సానుకూలంగా ఉంటారు అని అనుకుంటున్నారా?" అని మాగా సభ్యుల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు. కొందరైతే.. జేడీ వాన్స్​ వివాహం సంప్రదాయబద్ధం కాదని కూడా ఆరోపించారు.

Whats_app_banner

సంబంధిత కథనం