Two CRPF jawans killed: మణిపూర్ లోని సీఆర్ఫీఎఫ్ బెటాలియన్ కు చెందిన జవాన్లు ఎన్నికల డ్యూటీ కోసం గుజరాత్ వెళ్లారు. వారికి పోరు బందరు సమీపంలోని తుడ్క గొస గ్రామంలో డ్యూటీ వేశారు. అక్కడే ఉన్న ఒక తుపాను సహాయక కేంద్రంలో వారికి బస ఏర్పాటు చేశారు.
శనివారం సాయంత్రం వారి మధ్య చిన్న వాగ్వాదం ప్రారంభమై, క్రమంగా తీవ్రమైంది. దాంతో, క్షణికావేశంలో ఒక జవాను సహచరులపై తన తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే జామ్ నగర్ లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎం శర్మ తెలిపారు. పోర్ బందర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు తొలిదశలోనే జరగనున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో డిసెంబర్ 1, డిసెంబర్ 5 తేదీల్లో జరగనున్నాయి.