Astrologer Nidhi Chaudhary : ట్విట్టర్​లో 'బ్లౌజ్​' రచ్చ.. జ్యోతిష్కురాలిపై ట్రోల్స్​!-twitter trolls astrologer nidhi chaudhary for not wearing a blouse ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Twitter Trolls Astrologer Nidhi Chaudhary For Not Wearing A Blouse

Astrologer Nidhi Chaudhary : ట్విట్టర్​లో 'బ్లౌజ్​' రచ్చ.. జ్యోతిష్కురాలిపై ట్రోల్స్​!

Sharath Chitturi HT Telugu
Sep 11, 2022 07:08 PM IST

Twitter trolls astrologer Nidhi Chaudhary : ట్విట్టర్​లో ‘బ్లౌజ్​’ అనే పదం ట్రెండ్​ అవుతోంది. ఓ జ్యోతిష్కురాలు, ఆమె వేసుకున్న దుస్తులను నెటిజన్లు తెగ ట్రోల్​ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

నిధి చౌదరి
నిధి చౌదరి

Twitter trolls astrologer Nidhi Chaudhary : ఈ టెక్​ కాలంలో సోషల్​ మీడియాలో చాలా విషయాలు.. నిమిషాల్లో వైరల్​గా మారిపోతున్నాయి. కొన్నికొన్ని అసలు ఎందుకు వైరల్​గా మారుతుంటాయో కూడా అర్థం కాదు. ఇక ట్విట్టర్​ 'ట్రెండ్స్​' గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 'బాయ్​కాట్​' నుంచి 'ఫిక్సింగ్​' వరకు.. ఈ మధ్య కాలంలో అన్నీ తెగ ట్రెండ్​ అవుతున్నాయి.. తెగ వైరల్​ అవుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే.. ట్విట్టర్​లో ఆదివారం 'బ్లౌజ్​' అనే పదం ట్రెండింగ్​గా మారింది. ఈ బ్లౌజ్​ పదంపై నెటిజన్లు విపరీతంగా ట్వీట్లు చేస్తున్నారు. దీని వెనక ఓ కథ ఉంది. నిధి చౌదరి అనే జ్యోతిష్కురాలు చేసిన ఓ ట్వీట్​కు సంబంధించిందే ఈ రచ్చ అంత. ఇంతకీ ఏం జరిగిందంటే..

ట్రెండింగ్ వార్తలు

నిధి చౌదరి అనే జ్యోతిష్కురాలు.. శనివారం ఓ వీడియోతో కూడిన ట్వీట్​ చేసింది. శని దేవుడి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటూ ఆమె ఆ వీడియో చెప్పుకొచ్చింది. ఇతరులకు సహాయం చేయాలి, అందరితో మంచిగా ఉండాలి అంటూ పలు వ్యాఖ్యలు చేసింది. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది.

కానీ నెటిజన్లు.. జ్యోతిష్కురాలు నిధి చౌదరి మాటలను పట్టించుకోకుండా.. ఆమె డ్రెస్సింగ్​ స్టైల్​పై దృష్టిపెట్టారు! ఆ వీడియోలో నిధి చౌదరి బ్లౌజ్​ కనిపించలేదు. బ్లౌజ్​ లేకుండా.. శరీరానికి చీర కప్పుకున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అది అసభ్యకరంగా ఏమీ లేదు. కానీ ఆ ట్వీట్​తో పాటు నెటిజన్ల ట్రోల్స్​.. ట్విట్టర్​లో వైరల్​గా మారిపోయాయి. ఇప్పుడు అవి ట్విట్టర్​ ట్రెండింగ్​ లిస్ట్​లోకి చేరాయి.

Nidhi Chaudhary twitter : "నీకు డబ్బులు పంపిస్తా.. బ్లౌజ్​ కుట్టించుకో," అంటూ ఓ వ్యక్తి ట్రోల్​ చేశాడు. "బ్రహ్మాస్త చూడటం కన్నా.. ఆ డబ్బులతో ఈ పేద మహిళకు బ్లౌజ్​ కుట్టించి ఇస్తే బాగుండేది," అని ఇంకొకరు ట్వీట్​ చేశారు. "మాకు సలహాలు వద్దు.. నీకు మాత్రం బ్లౌజ్​ కావాలి," అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చారు. 'ఈ విషయం తెలిసిన తర్వాత.. సోనూ సూద్​.. జ్యోతిష్కురాలు నిధి చౌదరికి బ్లౌజ్​ కుట్టిస్తున్నాడు,' అంటూ మరో వ్యక్తి ట్రోల్​ చేశాడు.

ఇక తనపై వస్తున్న ట్రోల్స్​ని తిప్పికొట్టే పనిలో పడింది జ్యోతిష్కురాలు నిధి చౌదరి. పలువురు ఆమెకు మద్దతుగా కూడా ట్వీట్లు చేస్తున్నారు. "అందులో అసభ్యకరంగా ఏమీ కనిపించడం లేదు. ఆమె బట్టలు.. ఆమె ఇష్టం," అని అంటున్నారు. 'మహిళలు బ్లౌజ్​లు వేసుకోకుండా బయటకు వచ్చిన దేశం మనది,' అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చారు.

జ్యోతిష్కురాలు నిధి చౌదరికి ట్విట్టర్​లో 14వేలకుపైగా మంది ఫాలోవర్లు ఉన్నారు. "నేను ఓ లాయర్​. నేను ఓ సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెంజర్​, నేను ఫ్యాషన్​ స్టైలిస్ట్​. నేను జ్యోతిష్కురాలిని కూడా. సెక్సీగా ఉండటం అంటే నాకు చాలా ఇష్టం," అని కొన్ని వారాల క్రితమే ట్వీట్​ చేసింది నిధి చౌదరి.

IPL_Entry_Point

సంబంధిత కథనం