Covid cases : దేశంలో కొవిడ్ కేసుల పెరుగుదలకు అసలు కారణం ఇదే!
Covid cases surge in India : దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి నాలుగో వేవ్‌కు సంకేతాలా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై వైద్య నిపుణులు స్పందించారు.
Covid cases surge in India : ఇండియాలో కొవిడ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇది కొత్త వేవ్‌కు సంకేతం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ కేసుల పెరుగుదల స్వల్ప కాలమేనని, కొవిడ్ నాలుగో వేవ్ వల్ల కాదని స్పష్టం చేస్తున్నారు. కొవిడ్ కేసులు.. దేశవ్యాప్తంగా పెరగడం లేదని, కొన్ని ప్రాంతాల్లో అధికంగా నమోదవుతున్నాయని గుర్తుచేస్తున్నారు.
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఆర్టీ-పీసీఆర్ టెస్టులు పెంచాలని చెప్పారు. కొవిడ్‌పై నిఘా పెంచాలని, టీకాల పంపిణీని సైతం వేగవంతం చేయాలని సూచించారు.
"48-72గంటల్లోనే రోగుల ఆరోగ్యం మెరుగుపడటాన్ని చూస్తున్నాము. రెమ్డిసివిర్ అవసరం లేకుండానే కొవిడ్ తగ్గిపోతోంది. రోగుల్లో చాలా మందికి తీవ్ర అనారోగ్య పరిస్థితులు లేవు. అంటే.. టీకాలు పనిచేస్తున్నాయని స్పష్టమవుతోంది. కేసులు పెరుగుతున్నప్పటికీ.. కొవిడ్ వేవ్ తీవ్రత తక్కువ ఉండటం మంచి పరిణామాం. కేసులు తగ్గుతాయి. అదే సమయంలో కొవిడ్ తీవ్రత కూడా దిగొస్తోంది. అందువల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదు," అని ముంబైలోని గ్లోబల్ హాస్పిటల్‌కు చెందిన డా. మంజుష అగర్వాల్ వెల్లడించారు.
ప్రజలు మాస్కులు ధరించాలని, కొవిడ్ బూస్టర్ డోసు వేసుకోవాలని.. అప్పుడే కేసుల పెరుగదల నాలుగో వేవ్‌కు దారితీయదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
దేశంలో శుక్రవారం 18,815 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,22,335కు చేరింది.
ఇండియాలో కొత్త వేరియంట్?
India covid fourth wave : ఒమిక్రాన్‌కు చెందిన కొత్త సబ్‌వేరియంట్ బీఏ.2.75.. ఇండియాతో పాటు అనేక దేశాల్లో గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
"అమెరికా- యూరోప్‌లో బీఏ.4, బీఏ.5 వల్ల కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియా వంటి దేశాల్లో బీఏ.2.75 సబ్ వేరియంట్ వల్ల కేసులు పెరుగుతున్నాయి," అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనోట్ స్పష్టం చేశారు.
సంబంధిత కథనం
టాపిక్