World's ‘Tallest’ Shiva statue in Rajastan: 369 అడుగుల మహా దేవుడి మహా విగ్రహం-tallest shiva statue will be unveiled on saturday in rajasthan s rajsamand ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  World's ‘Tallest’ Shiva Statue In Rajastan: 369 అడుగుల మహా దేవుడి మహా విగ్రహం

World's ‘Tallest’ Shiva statue in Rajastan: 369 అడుగుల మహా దేవుడి మహా విగ్రహం

HT Telugu Desk HT Telugu
Oct 29, 2022 04:29 PM IST

World's ‘Tallest’ Shiva statue in Rajastan: మహా దేవుడి అద్భుత విగ్రహం రాజస్తాన్ లో రూపుదిద్దుకుంది. 369 అడుగుల ఎత్తైన ఈ ‘విశ్వాస స్వరూపం’ విగ్రహాన్ని రాజస్తాన్లోని నాథ్ ద్వారా పట్టణంలో ఏర్పాటు చేవారు.

రాజస్తాన్ లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం
రాజస్తాన్ లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం

World's ‘Tallest’ Shiva statue in Rajastan: రాజస్తాన్ లోని రాజ్ సమంద్ జిల్లాలో ఉన్న నాథ్ ధ్వారా పట్టణంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద శివుడి విగ్రహంగా దీన్ని భావిస్తున్నారు. రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, స్పీకర్ సీపీ జోషి సమక్షంలో ఆధ్యాత్మిక వత్త మొరారీ బాపు శనివారం దీన్ని ఆవిష్కరిస్తారు.

World's ‘Tallest’ Shiva statue in Rajastan: ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం

ఈ మహాదేవుడి మహా విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైనదిగా భావిస్తున్నారు. ఇది ఉదయపూర్ కు 45 కిమీల దూరంలో ఉంది. ఈ విగ్రహ నిర్మాణానికి తత్ పాదం సంస్థాన్ సహకరించింది. విగ్రహావిష్కరణ అనంతరం, శనివారం నుంచి 9 రోజుల పాటు పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని సంస్థాన్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ చైర్మన్ మదన్ పాలివాల్ వెల్లడించారు. ఆధ్యాత్మకి వేత్త మొరారి బాపు కూడా రామకథను వినిపిస్తారని తెలిపారు. ఈ విగ్రహం వల్ల ఈ ప్రాంతానికి మతపరమైన పర్యాటక ప్రాధాన్యత లభిస్తుందని మదన్ పాలివాల్ వివరించారు.

World's ‘Tallest’ Shiva statue in Rajastan: 17 ఎకరాల స్థలంలో..

ఎత్తైన గుట్టపై దాదాపు 17 ఎకరాల స్థలంలో(51 bighas) ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం శివుడు కూర్చుని ధ్యానం చేస్తున్నవిధంగా ఉంటుంది. దాదాపు 20 కిమీల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. రాత్రి సమయంలో కూడా కనిపించలా ప్రత్యేక లైట్లతో ఈ విగ్రహాన్ని అలంకరించారు. ఇందులో భక్తులు ధ్యానం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. అలాగే లిఫ్ట్స్, మెట్లు వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు.

World's ‘Tallest’ Shiva statue in Rajastan: 3 వేల టన్నుల ఉక్కు

ఈ విగ్రహం తయారీకి 3 వేల టన్నుల ఉక్కు, ఇనుమును, 2.5 క్యూబిక్ టన్నుల కాంక్రీట్ ను వాడారు. ఈ విగ్రహం రూపొందించడానికి సుమారు 10 ఏళ్ల సమయం పట్టింది. గంటకు 250 కిమీల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా ఈ విగ్రహాన్ని రూపొందించారు. కనీసం 250 ఏళ్ల పాటు ఈ విగ్రహం చెక్కుచెదరదని సంస్థాన్ నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రాంతంలో బంగీ జంపింగ్, గో కార్ట్, అడ్వెంచర్ పార్క్, జంగిల్ కేఫ్, జిప్ లైన్ తదితరాలకు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2012లో జరిగిన విగ్రహం శంకుస్థాపన కూడా నాటి ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సమక్షంలోనే జరగడం విశేషం.

IPL_Entry_Point