Stock markets | ఒడుదొడుకుల్లో దేశీయ సూచీలు..
Stock market news | సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఒడుదొడుకుల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితులు ఇందుకు కారణం!
బీఎస్ఈ సెన్సెక్స్ (REUTERS)
Stock market live updates | అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పవనాల మధ్య దేశీయ సూచీలు సోమవారం ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు రెండు లాభాల్లో ప్రారంభమైనా.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.
సెన్సెక్స్ 58,030 వద్ద ప్రారభమై.. ప్రస్తుతం 48 పాయింట్ల నష్టంతో 57,816 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 17,329 వద్ద ప్రారంభమై.. ప్రస్తుతం 17,272 వద్ద కొనసాగుతోంది.
లాభాలు.. నష్టాలు..
విప్రో, ఇన్ఫోసిస్, మారుతి, టెక్ఎం, టాటా స్టీల్, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్, కొటాక్ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్