Rajasthan Congress crisis: రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో మరోసారి రసవత్తరంగా రాజకీయం-sonia gandhi directs party observers to hold one on one talks with miffed mlas in rajasthan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rajasthan Congress Crisis: రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో మరోసారి రసవత్తరంగా రాజకీయం

Rajasthan Congress crisis: రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో మరోసారి రసవత్తరంగా రాజకీయం

HT Telugu Desk HT Telugu
Sep 26, 2022 10:20 AM IST

Rajasthan Congress crisis: రాజస్తాన్ కాంగ్రెస్‌లో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. అశోక్ గెహ్లాట్ శిబిరంలోని మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పిస్తున్నారు.

రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి నివాసం ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి నివాసం ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (HT_PRINT)

Rajasthan Congress crisis: ఎమ్మెల్యేల రాజీనామా సమస్యను పరిష్కరించేందుకు వారితో చర్చలు జరపాలని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.. పార్టీ పరిశీలకులు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్‌లను ఆదేశించారు.

గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవిపై అయిష్టంగా ఉన్న అభ్యర్థిగా చాలా మంది భావించారు. మొదట్లో తన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. తరువాత, తన నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ కంటే జోషిని, లేదా మరెవరినైనా ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు చూస్తున్నారని చర్చ జరుగుతోంది.

జైసల్మేర్‌లో విలేకరులతో గెహ్లాట్ మాట్లాడుతూ, తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరుతూ సీఎల్‌పీ సమావేశంలో ఎమ్మెల్యేలు ఏక వాక్య తీర్మానం చేస్తారని చెప్పారు. కానీ ఎమ్మెల్యేలు దీనికి విరుద్ధంగా రాజీనామా బాట పట్టారు.

జైపూర్‌లో ఆదివారం జరగాల్సిన రాజస్థాన్ సీఎల్పీ సమావేశానికి మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్‌లను పరిశీలకులుగా నియమించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థ) కేసీ వేణుగోపాల్ తెలిపారు.

తమ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్‌కు అందించిన దాదాపు 90 మంది ఎమ్మెల్యేలను పరిశీలకులు ఇద్దరూ సోమవారం కలిసే అవకాశం ఉంది.

‘ప్రస్తుతం మేం ఢిల్లీకి వెళ్లడం లేదు. రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరపాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మాకు ఆదేశాలు జారీ చేశారు. మేం ఈ రాత్రి వారిని కలుస్తాం..’ అని అజయ్ మాకెన్ ఏఎన్ఐకి చెప్పారు.

త్వరలోనే పరిస్థితి చక్కబెడతామని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ అన్నారు. ‘నేను సీఎం అశోక్ గెహ్లాట్‌తో మాట్లాడలేదు. నాకు ఫోన్ చేయలేదు. త్వరలో పరిస్థితులు సర్దుకుంటాయి..’ అని వేణుగోపాల్ అన్నారు.

మరోవైపు పార్టీపై అసంతృప్తితో ఉన్న రాజస్థాన్‌ మంత్రులు ప్రతాప్‌సింగ్‌ ఖచరియావాస్‌, శాంతి ధరివాల్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ నివాసంలో ఏఐసీసీ పరిశీలకులు అజయ్‌ మాకెన్‌, మల్లికార్జున్‌ ఖర్గేలతో సమావేశమవుతున్నారు.

అంతకుముందు ప్రతాప్ సింగ్ ఖాచరియావాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎన్నిక నిర్ణయానికి ముందు తమతో సంప్రదించనందున ఎమ్మెల్యేలందరూ కోపంగా ఉన్నారని, రాజీనామా చేస్తున్నారని అన్నారు.

పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ సుముఖత వ్యక్తం చేశారు. ‘నేను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను త్వరలో నామినేషన్ దాఖలు చేయడానికి తేదీని ఫిక్స్ చేస్తాను. ప్రస్తుత స్థితిలో దేశంలో ప్రతిపక్షం బలంగా ఉండాల్సిన అవసరం ఉంది..’ అని అన్నారు.

సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనే..

అశోక్ గెహ్లాట్‌కు విధేయులైన పలువురు ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందని ఆందోళన చెందుతూ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు.

ఆదివారం మంత్రి శాంతి ధరివాల్ నివాసంలో సుదీర్ఘ సమావేశం తర్వాత గెహ్లాట్ విధేయులు స్పీకర్ సీపీ జోషి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

శాసనసభ్యులందరూ సీఎల్పీ సమావేశానికి వచ్చే వరకు ముఖ్యమంత్రి ఇంటి వద్ద గెహ్లాట్, ఖర్గే, మాకెన్ వేచి ఉన్నారు. పైలట్, అతని మద్దతుదారులు సమావేశానికి హాజరయ్యారు. అయితే 90 మంది ఎమ్మెల్యేలు జోషి ఇంటికి వెళ్లారని గెహ్లాట్ విధేయులు పేర్కొన్నారు. 200 మంది ఉన్న సభలో కాంగ్రెస్‌కు 108 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

రాజీనామా లేఖలపై స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేదు. మంత్రులు ధరివాల్, ప్రతాప్ సింగ్ ఖచరియావాస్, మహేశ్ జోషి, సీఎం గెహ్లాట్ సలహాదారు సన్యామ్ లోధా ఏఐసీసీ పరిశీలకులతో సమావేశమైనప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతోంది.

తదుపరి ముఖ్యమంత్రిపై నిర్ణయం కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల తర్వాత వరకు వదిలివేయాలని వారు ఆశిస్తున్నారు. 2020లో పైలట్ మద్దతుదారుల తిరుగుబాటు సమయంలో గెహ్లాట్‌కు అండగా నిలిచిన వ్యక్తిని కొత్త ముఖ్యమంత్రిని ఎంచుకోవడంలో గెహ్లాట్ పాత్ర ఉండాలని ఆయన విధేయులు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

‘మేం మా రాజీనామాను సమర్పించాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాతే సీఎంపై నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు..’ అని మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్ అన్నారు.

ఎమ్మెల్యేల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోకుంటే ప్రభుత్వానికి ప్రమాదం తప్పదని స్వతంత్ర శాసనసభ్యుడు, ముఖ్యమంత్రి సలహాదారు లోధా అన్నారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి పదవి విషయంలో గెహ్లాట్, పైలట్ మధ్య విభేదాలు వచ్చాయి.

హైకమాండ్ గెహ్లాట్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోగా, పైలట్‌ను డిప్యూటీ సీఎంను చేసింది. జూలై 2020లో పైలట్‌తో పాటు 18 మంది పార్టీ ఎమ్మెల్యేలు గెహ్లాట్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు.

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

అశోక్ గెహ్లాట్, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ మధ్య పోటీతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల దాఖలు శనివారం ప్రారంభమైంది.

సెప్టెంబరు 30 వరకు నామినేషన్లు దాఖలుకు సమయం ఉంది. కొత్త కాంగ్రెస్ చీఫ్‌ను ప్రకటించే ఫలితాలు అక్టోబర్ 19 న వెల్లడవుతాయి.

1998లో సీతారామన్ కేసరిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత 25 ఏళ్లలో గాంధీయేతర ముఖ్యమంత్రిని కాంగ్రెస్ చూడటం ఇదే తొలిసారి.

చివరిసారిగా 1997లో జరిగిన ఎన్నికలో శరద్ పవార్, రాజేష్ పైలట్‌, సీతారాం కేసరీ తలపడ్డారు. గాంధీ కుటుంబం నుంచి ఈసారి అభ్యర్థి ఎవరూ లేరని గెహ్లాట్ గతంలోనే స్పష్టం చేశారు.

IPL_Entry_Point

టాపిక్