Reliance share | నెల రోజుల్లో 14శాతం పెరిగిన స్టాక్​.. ఇక భారీ లాభాలే!-reliance share surge 14 in a month key factors driving the stock rally ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Reliance Share | నెల రోజుల్లో 14శాతం పెరిగిన స్టాక్​.. ఇక భారీ లాభాలే!

Reliance share | నెల రోజుల్లో 14శాతం పెరిగిన స్టాక్​.. ఇక భారీ లాభాలే!

HT Telugu Desk HT Telugu
Mar 27, 2022 04:37 PM IST

రిలయన్స్​ షేరు నెల రోజుల్లో 14శాతం పెరిగింది. మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నా.. 5 ట్రేడింగ్​ సెషన్స్​లో స్టాక్​ 5శాతం పెరిగింది. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే…

<p>రిలయన్స్​</p>
రిలయన్స్​ (REUTERS)

Reliance share news | రష్యా ఉక్రెయిన్​ యుద్ధంతో ప్రపంచ దేశాల స్టాక్​ మార్కెట్లు తీవ్రంగా ఊగిసలాడుతున్నాయి. దేశీయ సూచీలు ఇందుకు భిన్నం ఏమీకాదు. ఒడుదొడుకులతో మదుపర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. అయితే వీటి మధ్య ఒక ఆసక్తికర విషయం జరుగుతోంది. హెవీవెయిట్​ షేర్లలో ఒకటైన రిలయన్స్​.. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోంది. శుక్రవారం ట్రేడింగ్​ ముగిసే నాటికి.. వారం రోజుల్లో 5శాతం, నెల రోజుల్లో 14శాతం పెరిగింది. ప్రస్తుతం 2,600 వద్ద ఉంది. కాగా.. ఆల్​టైమ్​ హై(2,750) నుంచి 5శాతం దూరంలో ఉంది రిలయన్స్​ స్టాక్​.

ఇందుకు కారణాలను మార్కెట్​ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సింగపూర్​ గ్రాస్​ రిఫైనింగ్​ మార్జిన్​(జీఆర్​ఎం) పెరుగుతుండటం వల్ల రిలయన్స్​కు మంచి జరుగుతోందని అంటున్నారు. ఓవైపు చమురు, గ్యాస్​ ధరలు భారీగా పెరుగుతుండటంతో రిలయన్స్​ పెట్రోకెమికల్​ వ్యాపారానికి మంచి మార్జిన్లు లభించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రష్యా ఉక్రెయిన్​ యుద్ధంతో రిలయన్స్​ టెలికాం వ్యాపారం దెబ్బతినలేదని, పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో రిటైల్​ బిజినెస్​కు నష్టాలు కలగకుండా సంస్థ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని చెబుతున్నారు. అదే సమయంలో పునరుత్పాదక శక్తికి చెందిన వ్యాపారాన్ని విస్తరించేందుకు తీవ్రంగా కృషి చేస్తోందని స్పష్టం చేస్తున్నారు.

Reliance share price target | ఇక టెక్నికల్స్​ విషయానికొస్తే.. 2,250 దగ్గర రిలయన్స్​ స్టాక్​ బలమైన సపోర్టును ఏర్పరచుకుందని, 2,700-2,750 వద్ద రెసిస్టెన్స్​ ఉందని స్వస్తిక ఇన్​వెస్ట్​మెంట్​ లిమిటెడ్​ రిసెర్చ్​ హెడ్​ సంతోష్​ మీనా వెల్లడించారు. రెసిస్టెన్స్​ బ్రేక్​ అయితే స్టాక్​ విలువ రూ. 3,000కు కూడా చేరే అవకాశం ఉందన్నారు.

గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసమే. ఇవి పూర్తిగా నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. వీటితో హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. పెట్టుబడులు పెట్టే ముందు ఫైనాన్షియల్​ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.

 

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్