Adani Crisis - Mitr Kaal: ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ‘వీడియో’ అటాక్.. అదానీ విషయంలో ప్రశ్నల వర్షం: Video
Adani Crisis - Mitr Kaal: అదానీ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై మరోసారి ప్రశ్నలు కురిపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). మిత్ర్ కాల్ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
Adani Crisis - Mitr Kaal: అదానీ వివాదం (Adani Controversy)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాటల దాడి కొనసాగించారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani)కి ప్రధాని మోదీ (Narendra Modi) మిత్రుడంటూ పార్లమెంటులో ఆరోపించిన రాహుల్ గాంధీ.. నేడు వీడియోతో అటాక్ చేశారు. మిత్ర్ కాల్ (Mitr Kaal) పేరుతో తన అధికారిక యూట్యూబ్ ఖాతాలో మొదటి ఎపిసోడ్‍ను రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. బీజేపీ చెబుతున్న అమృత్ కాల్‍కు కౌంటర్‌గా రాహుల్ ఈ వీడియో సిరీస్‍కు మిత్ర్ కాల్ అని పేరు పెట్టినట్టు అర్థం అవుతోంది. అదానీకి కాంట్రాక్టులను ధారాదత్తంగా ఎందుకు ఇచ్చేశారని మోడీని మరోసారి ఈ వీడియోలో వివరంగా ప్రశ్నించారు రాహుల్. పూర్తి వివరాలు ఇవే.
ఆరు ఎయిర్‌పోర్టులు ఎందుకు?
Adani Crisis - Mitr Kaal: పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం కింద 2018లో అదానీ గ్రూప్‍నకు ఆరు ఎయిర్‌పోర్టులను మోదీ ప్రభుత్వం ఎందుకు కేటాయించిందని మిత్ర్ కాల్ వీడియోలో రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సంవత్సరం తర్వాత లక్నో, అహ్మదాబాద్, గువహటి, మంగళూరు, తిరువనంతపురం ఎయిర్‌పోర్టుల నిర్వహణ కాంట్రాక్టును అదానీకి మాత్రమే ఎందుకు ఇచ్చారని రాహుల్ అన్నారు.
నిజాలను రికార్డుల నుంచి తొలగించారు
Adani Crisis - Mitr Kaal: “పార్లమెంటులో నేను నిజాలు మాట్లాడాను. ప్రధాని మోదీ, అదానీ మధ్య అనుబంధం విషయం ఏంటి?. భారత సంపద ఎలా లూటీకి గురైందన్న విషయం గురించి నేను మాట్లాడా. కానీ ఆ నిజాలను పార్లమెంటు రికార్డుల నుంచి తీసేశారు” అని రాహుల్ గాంధీ అన్నారు. గౌతమ్ అదానీతో ప్రధాని మోదీ ఉన్న మరో పోస్టర్‌ను వీడియోలో ప్రదర్శించారు.
మోనమేల మోదీ?
Adani Crisis - Mitr Kaal: తాను సంధించిన ఏ ప్రశ్నకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వలేదని వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. అదానీ విషయంలో మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. “ఎయిర్‌పోర్టును తన జీవితంలో నిర్వహించిన అనుభవం లేని, ఆ బిజినెస్ గురించి తెలియని వ్యక్తికి ఇండియాలోని లాభదాయకరమైన ఎయిర్‌పోర్టులను ఎందుకు కేటాయించారు” అని మిత్ర్ కాల్ వీడియోలో రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
“ఒకే కంపెనీకి ఆరు ఎయిర్‌పోర్టులను ఎందుకు అప్పగించారు? కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, ఏఏఐ ఈ విషయంపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మరి ఎవరు, ఎందుకు ఆ అభ్యంతరాలను తోసిపుచ్చారు? కన్సెషన్ లీజు 30 సంవత్సరాలుగా ఉండగా.. హఠాత్తుగా అదానీ కోసం 50ఏళ్లకు ఎందుకు మార్చారు? అని మిత్ర్ కాల్ వీడియోలో ప్రధాని మోదీని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ కింద వీడియో చూడండి.
న్యూయార్క్ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ (Hindenburg) అదానీ గ్రూప్‍పై నివేదిక వెల్లడించాక వివాదం మొదలైంది. ఆర్థిక విషయాల్లో అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో అదానీ గ్రూప్ కింద ఉన్న కంపెనీల షేర్లు, గౌతమ్ అదానీ సంపద భారీగా పడిపోయింది. ఈ విషయంపై అధికార బీజేపీని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనూ ఈ అంశం దుమారం రేపుతోంది.