Pune Porsche crash : పూణె పోర్షే కేసు నిందితుడి తల్లి అరెస్ట్- కొడుకు కోసం..
పూణె పోర్షే కేసు నిందితుడి తల్లిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితుడు, అతని తండ్రి, అతని తాతతో పాటు ఇప్పుడు మైనర్ తల్లి కూడా జైలుకు వెళ్లారు!
Porsche accident Pune latest updates : యావత్ దేశాన్ని ఆగ్రహానికి గురిచేసిన పూణె పోర్షే కేసులో మరో కీలక అప్డేట్. మద్యం మత్తులో లగ్జరీ వాహనాన్ని అత్యంత వేగంగా నడిపి, ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ తల్లిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కుమారుడి బ్లడ్ శాంపిల్స్ మార్చేసి, అతడిని ఇంతటి ఘోరమైన నేరం నుంచి తప్పించేందుకు ఆమె ప్రయత్నించిందని పోలీసులు ఆరోపించారు.
పుణె పోర్షే కేసు అప్డేట్..
పూణె పోర్షే కేసుకు సంబంధించి.. ఇప్పటికే నిందితుడు, అతని తండ్రి- ప్రముఖ రియాల్టర్ విశాల్ అగర్వాల్, అతని తాత జైలులో ఉన్నారు. ఇప్పుడు తల్లి కూడా అరెస్ట్ అవ్వడంతో.. మైనర్ కుటుంబంలోని మొత్తం నలుగురు జైలుకు వెళ్లినట్టు అయ్యింది!
Pune Porsche case update : పూణె కళ్యాణి నగర్లో మే 19న.. ఈ ఘటన జరిగింది. నిందితుడు.. ఇంటర్ పరీక్ష పాసైనందుకు తన ఫ్రెండ్స్‌తో కలిసి పబ్‌కి వెళ్లి పార్టీ చేసుకున్నాడు. వాస్తవానికి 17ఏళ్ల బాలుడికి పబ్‌లో ఎంట్రీ ఉండదు. మద్యం కూడా ఇవ్వకూడదు. కానీ ఆ మైనర్.. మద్యం సేవించి, బయటకు వచ్చి.. డ్రైవర్ని పక్కన కూర్చోబెట్టి అత్యంత వేగంగా పోర్షే కారు నడిపాడు. కళ్యాణి ప్రాంతంలో బైక్‌ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఐటీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.
కాగా.. పోలీసులు నిందితుడిని అప్పుడే అరెస్ట్ చేశారు. కానీ తొలుత అతడికి 15 గంటల్లోనే బెయిల్ లభించింది. పైగా.. యాక్సిడెంట్ల మీద వ్యాసాలు రాయాలంటూ బెయిల్ ఇవ్వడం సర్వత్రా చర్చకు దారి తీసింది. చివరికి.. ఇది దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. పూణె ప్రజలు తీవ్రస్థాయిల నిరసన వ్యక్తం చేశారు. ఫలితంగా.. ఈ కేసుపై పోలీసులు వేగంగా పావులు కదపడం మొదలుపెట్టారు.
Pune Porsche case accused mother arrested : దర్యాప్తులో భాగంగా.. నిందితుడిని అరెస్ట్ చేశారు. మైనర్కి బండి ఇచ్చిన అతని తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. నేరాన్ని తన మీద మోపేందుకు ప్రయత్నిస్తున్నారని డ్రైవర్ ఆరోపించడంతో.. ఆ మైనర్ తాతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక ఘటన జరిగిన రాత్రి.. పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లినప్పటికీ.. బ్లడ్ శాంపిల్‌ని చాలా ఆలస్యంగా సేకరించారని తొలుత సమాచారం వచ్చింది. పిజ్జాలు తినిపించి, రక్తంలో మద్యం నమూనాలను తొలగించాలని చూసినట్టు వార్తలు వచ్చాయి. చివరికి.. బ్లడ్ శాంపిల్‌లో మద్యం రిపోర్టు నెగిటివ్‌గా వచ్చింది! ఇదెలా సాధ్యం? అని సీనియర్ అధికారులు దర్యాప్తు చేస్తుండగా.. పలు షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. బ్లడ్ శాంపిల్ సేకరించిన ఆసుపత్రిలో కొందరు వైద్యులు.. దానిని మార్చేశారని తేలింది. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Pune Porsche case : చివరికి.. ఆ బ్లడ్ శాంపిల్ మైనర్ తల్లిదని తేలింది. ఫలితంగా.. కొడుకును రక్షించేందుకు ఆమె కుట్రకు పాల్పడటంతో.. మైనర్ తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
సంబంధిత కథనం