Aaftab new girlfriend interrogated: ఆఫ్తాబ్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఒక డాక్టర్-psychologist whom aaftab dated after killing shraddha interrogated ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aaftab New Girlfriend Interrogated: ఆఫ్తాబ్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఒక డాక్టర్

Aaftab new girlfriend interrogated: ఆఫ్తాబ్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఒక డాక్టర్

HT Telugu Desk HT Telugu

Aaftab new girlfriend interrogated: లివిన్ పార్ట్ నర్ శ్రద్ధ వాకర్ ను హత్య చేసిన తరువాత, ఆఫ్తాబ్ పూనావాలా మరో యువతితో డేటింగ్ చేశాడు. ఆ యువతి ఒక డాక్టర్ అని పోలీసులు గుర్తించారు.

లివిన్ పార్ట్ నర్ శ్రద్ధను హత్య చేసిన ఆఫ్తాబ్ (ఫైల్ ఫొటో)

Aaftab new girlfriend interrogated: శ్రద్ధ ను దారుణంగా హతమార్చి, ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి, ఫ్రిజ్ లో పెట్టిన ఆఫ్తాబ్ దాదాపు నెల రోజుల పాటు వాటిని ఆ ఫ్రిజ్ లో నుంచి తీయలేదు. ఆ గ్యాప్ లోనే మరో యువతితో ఫ్రెండ్ షిప్ చేసి, ఆ యువతిని తమ ఫ్లాట్ కు కూడా తీసుకువచ్చాడు. ఫ్లాట్ లోని ఫ్రిజ్ లో శ్రద్ధ శరీర భాగాలు ఉండగానే, ఆ కొత్త ఫ్రెండ్ ను ఫ్లాట్ కు తీసుకుని వచ్చాడు.

Aaftab new girlfriend interrogated: పోలీసుల విచారణ

ఆఫ్తాబ్ కొత్త స్నేహితురాలు ఒక సైకాలజిస్ట్. ఆమె కూడా శ్రద్ధ లాగానే డేటింగ్ యాప్ ‘బంబుల్’ ద్వారా ఆఫ్తాబ్ కు పరిచయమైంది. శ్రద్ధ ను హత్య చేసిన తరువాత ఈ సైకాలజిస్ట్ తో పరిచయం పెంచుకున్నాడు. ఈ వివరాలను పోలీసులు బంబుల్ యాప్ నిర్వాహకుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఆ యువతిని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. ఆమె సమాధానాలను పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో సేకరించిన సమాచారంతో సరిపోల్చుకున్నారు.

Aaftab new girlfriend interrogated: తిహార్ జైలుకు ఆఫ్తాబ్

పోలీసు కస్టడీ సమయం ముగియడంతో ఆఫ్తాబ్ ను పోలీసులు శనివారం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆఫ్తాబ్ కు నాలుగు రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది. దాంతో, అతడిని పోలీసులు తిహార్ జైలుకు తరలించారు. ఆఫ్తాబ్ నుంచి మరింత సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని, అందువల్ల పోలీసు కస్టడీని పొడగించాలని పోలీసులు చేసిన అభ్యర్థనను ఆఫ్తాబ్ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. 14 రోజులకు మించి పోలీసు కస్టడీకి ఇవ్వకూడదన్న నిబంధనను గుర్తు చేశారు. కస్టడీ సమయంలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? అని కోర్టు ప్రశ్నించగా, ప్రయోగించలేదని ఆఫ్తాబ్ జవాబిచ్చాడు. తాను విచారణకు సహకరిస్తున్నానని తెలిపాడు. తిహార్ జైలు నెంబర్ 4 లో ఒక్కరు మాత్రమే ఉండే సెల్ లో ఆఫ్తాబ్ ను ఉంచినట్లు జైలు వర్గాలు తెలిపాయి.

Aaftab new girlfriend interrogated: లై డిటెక్టర్ టెస్ట్

ఆఫ్తాబ్ కు శుక్రవారంతో లై డిటెక్టర్ పరీక్ష ముగిసింది. టెస్ట్ కు సంబంధించి ప్రి, మెయిన్, పోస్ట్ స్టేజెస్ ముగిశాయని ఫొరెన్సిక్ ల్యాబ్ వర్గాలు వెల్లడించాయి. శ్రద్ధతో రిలేషన్, గొడవలు, హత్య చేయడానికి కారణాలు, శరీరాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగించిన వస్తువులు, ఆ వస్తువులను, శరీర భాగాలను ఎక్కడ పడేశాడన్న విషయం.. మొదలైన అంశాలను పోలీసులు ఈ పరీక్ష సమయంలో ప్రశ్నించినట్లు తెలిపాయి. సోమవారం ఆఫ్తాబ్ కు నార్కొ టెస్ట్ నిర్వహించే అవకాశముంది.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.