Chandrayaan-3: చంద్రయాన్ 3 విజయంపై ఇస్రో టీమ్ కు సెల్యూట్ చేసిన మోదీ; దశాబ్దాల కృషికి ఫలితమని అభినందించిన రాహుల్ గాంధీ
Chandrayaan-3: చంద్రయాన్ 3 తొలి దశ ప్రయోగం విజయవంతమైన కొన్ని నిమిషాల్లోనే ప్రధాని మోదీ స్పందించారు. ఇస్రో టీమ్ కు, భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Chandrayaan-3: చంద్రయాన్ 3 తొలి దశ ప్రయోగం విజయవంతమైన కొన్ని నిమిషాల్లోనే ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ఇస్రో టీమ్ కు, భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Chandrayaan-3: ఇది సువర్ణాధ్యాయం
‘‘భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో చంద్రయాన్ 3 కొత్త అధ్యాయం లిఖిస్తోంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ప్రయోగం ప్రతీ భారతీయుడి ఆశయాలను, లక్ష్యాలను, స్వప్నాలను మరింత ఎత్తుకు తీసుకువెళ్తుందని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం మన శాస్త్రవేత్తల అలుపెరగని కృషికి, వారి అంకితభావానికి నిదర్శనం. వారి స్ఫూర్తికి, పట్టుదలకు నా సెల్యూట్’’ అని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసించారు.
Rahul Gandhi tweet: రాహుల్ గాంధీ ప్రశంసలు..
చంద్రయాన్ 3 విజయవంతంగా కక్షలో ప్రవేశించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా అద్భుతమైన సందర్భం. గొప్ప విజయం. ఇస్రో టీమ్ కు నా శుభాభినందనలు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు 100 కోట్లకు పైగా భారతీయులు గర్వంగా ఆకాశంలోకి చూస్తూ, విజయోత్సవాలు జరుపుకున్నారు. 1962 లో స్పేస్ ప్రొగ్రామ్ ప్రారంభమైంది. ఆ తరువాత 1969 లో ఇస్రో ను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించింది. ఆ నాటి నుంచి భారతీయ శాస్త్రవేత్తలు కృషి, పట్టుదల, తెలివితేటలతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ఉన్నత శిఖరాలకు చేరింది. తాజా ప్రయోగం విజయవంతమైతే, చంద్రుడిపై ల్యాండ్ అయిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది’’ అని రాహుల్ స్పందించారు.
August 23rd landing: ఆగస్ట్ 23 న ల్యాండింగ్
దాదాపు నెల రోజులకు పైగా, 3 లక్షల కిమీలు ప్రయాణించిన తరువాత చంద్రయాన్ 3 చంద్రుడి ఉపరితలంపై దిగడానికి సిద్ధమవుతుంది. ఆగస్ట్ 23 వ తేదీన చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయిన తరువాత ల్యాండర్ లో నుంచి బయటకు వచ్చిన రోవర్ అక్కడ ఒక ల్యూనార్ డే (భూమిపై 14 రోజులు) చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ, అక్కడి ఉపరితలాన్ని, వాతావరణాన్ని పరిశీలిస్తుంది. అత్యాధునిక కెమెరాలతో ఫొటోలు తీస్తుంది.