Maan Ki Baat : మన్ కీ బాత్‌లో అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని మోదీ
Maan Ki Baat : మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక విషయాలు మాట్లాడారు. ఎన్డీయేను తిరిగి అధికారంలోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఓ విషయంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ముఖ్యమైన విషయాలు గురించి మాట్లాడారు. ఎన్డీయే అధికారంలోకి రావడంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే పారిస్ ఒలింపిక్స్ గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. మెగా ఈవెంట్లో పాల్గొనే అథ్లెట్లు, క్రీడాకారులకు మద్దతు ఇవ్వాలని, ఉత్సాహపరచాలని ప్రజలను కోరారు. వారిని ప్రేరేపించడానికి సోషల్ మీడియాలో '#cheer4Bharat' ను ఉపయోగించాలని కోరారు.
ప్రధాని మోదీ ఏం మాట్లాడారంటే..
ఫిబ్రవరి 25న జరిగిన చివరి ఎపిసోడ్ నుంచి కమ్యూనికేషన్ మిస్సయ్యాను. ఎన్నికల ప్రక్రియ కారణంగా కమ్యూనికేషన్ ఆగిపోయింది. ఫిబ్రవరి నుంచి మనమంతా ఎదురు చూస్తున్న రోజు నేడు వచ్చింది. మన్ కీ బాత్ ద్వారా నేను మరోసారి నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నాను. ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ మిమ్మల్ని కలుస్తానని ఫిబ్రవరిలోనే చెప్పాను.
ఎన్డీయేను వరుసగా మూడోసారి ఎన్నుకున్న ఓటర్లకు కృతజ్ఞతలు. రాజ్యాంగం, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై అచంచల విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు ఈ రోజు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 2024 లోక్ సభ ఎన్నికలు ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలు. 65 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్న ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత పెద్ద ఎన్నికలు జరగలేదు. ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను.
ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన చేస్తారని దేశం ఆశిస్తోంది. నా ప్రియమైన దేశప్రజలారా, వచ్చే నెలలో ఈ సమయానికి పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యేవి. ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు మీరంతా ఎదురు చూస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రారంభించిన 'ఏకే పేడ్ మా కే నామ్' ప్రచారం మెుదలుపెట్టాం. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'ఏక్ పేడ్ మా కే నామ్' పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్ ప్రారంభమైంది. నేను కూడా నా తల్లి పేరిట ఒక చెట్టును నాటాను. దేశ ప్రజలందరూ వారి తల్లితో పాటు లేదా ఆమె పేరుతో ఒక చెట్టును నాటాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ రోజు మన్ కీ బాత్‌లో ఒక ప్రత్యేకమైన గొడుగు గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ గొడుగులు మన కేరళలో తయారవుతాయి. కేరళ సంస్కృతిలో గొడుగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అక్కడ అనేక సంప్రదాయాలు, ఆచారాలలో గొడుగులు ఒక ముఖ్యమైన భాగం. కానీ నేను చెబుతున్న గొడుగు 'కార్తుంబి గొడుగులు' ఇవి కేరళలోని అట్టప్పాడిలో తయారవుతాయి. ఈ గొడుగులను కేరళకు చెందిన గిరిజన సోదరీమణులు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ గొడుగులకు డిమాండ్ పెరుగుతోంది. వాటిని ఆన్ లైన్ లో కూడా విక్రయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరకు కాఫీ చాలా ప్రత్యేకతమైనది. మిత్రులారా, భారతదేశం నుండి చాలా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. భారతదేశం ఏదైనా స్థానిక ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడం చూసినప్పుడు, గర్వంగా అనిపించడం సహజం. అలాంటి ఉత్పత్తుల్లో అరకు కాఫీ కూడా ఒకటి.