Platform ticket prices : ఈ ప్రాంతాల్లో.. ప్లాట్​ఫాం టికెట్​ ధరల తగ్గింపు-northern railway brings back old platform ticket prices check details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Platform Ticket Prices : ఈ ప్రాంతాల్లో.. ప్లాట్​ఫాం టికెట్​ ధరల తగ్గింపు

Platform ticket prices : ఈ ప్రాంతాల్లో.. ప్లాట్​ఫాం టికెట్​ ధరల తగ్గింపు

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 04, 2022 07:10 AM IST

Platform ticket prices : పండుగ సీజన్​ ముగియడంతో ప్లాట్​ఫాం టికెట్ రేట్లు పాత స్థితికి చేరుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే రేట్లు తగ్గాయి.

ఈ ప్రాంతాల్లో.. ప్లాట్​ఫాం టికెట్​ ధరల తగ్గింపు
ఈ ప్రాంతాల్లో.. ప్లాట్​ఫాం టికెట్​ ధరల తగ్గింపు

Platform ticket prices : పండుగ సీజన్​ నేపథ్యంలో రద్దీని నియంత్రించేందుకు వివిధ ప్రాంతాల్లో ప్లాట్​ఫాం టికెట్​లను పెంచారు రైల్వే అధికారు. ఇక ఇప్పుడు ఆ ధరలు దిగొస్తున్నాయి. తాజాగా.. ఉత్తర రైల్వే.. ప్లాట్​ఫాం టికెట్​ ధరలను తగ్గించింది.

ఈ ప్రాంతాల్లో తగ్గింపు..

దీపావళి, ఛత్​ పూజ సందర్భంగా రద్దీని నియంత్రించేందుకు.. ప్లాట్​ఫాం టికెట్​ ధరలను రూ. 50 చేశారు. ఇక పండుగ సీజన్​ ముగియడంతో పాత ప్లాట్​ఫాం టికెట్​ ధరలు తిరిగి అమల్లోకి వచ్చాయి. ఫలితంగా ప్రస్తుతం ప్లాట్​ఫాం టికెట్​ ధరలు రూ. 10గా ఉన్నాయి.

Platform ticket rates : లక్నో, వారణాసి, బారాబంకీ, అయోధ్య కాంట్​, అయోధ్య జంక్షన్​, అక్బర్​పూర్​, షాహ్​గంజ్​, జౌన్​పూర్​, సుల్తాన్​పూర్​ జంక్షన్​, రాయ్​బరేలీ, జంఘై, భదోహి, ప్రతాప్​గఢ్​, ఉన్నావ్​ జంక్షన్​లో ప్లాట్​ఫాం టికెట్​ ధరలు తగ్గినట్టు నార్తెన్​ రైల్వే డీసీఎం(డివిజనల్​ కమర్షియల్​ మేనేజర్​) నుంచి ఓ ప్రకటన వెలువడింది.

"మొత్తం మీద 14 రైల్వే స్టేషన్లలో ప్లాట్​ఫాం టికెట్​లను రూ.10కి చేశారు. దీపావళి, ఛత్​ పూజ సందర్భంగా రూ. 50గా పెంచాము. ఇప్పుడు వాటిని తగ్గించాము," అని డీసీఎం రేఖ శర్మ తెలిపారు.

దక్షిణ రైల్వే..

పండుగ సీజన్​లో రద్దీని నియంత్రించేందుకు.. దక్షిణ రైల్వే కూడా ప్లాట్​ఫాం టికెట్​ రేట్లను పెంచింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​తో పాటు అనేక ప్రాంతాల్లోని ప్లాట్​ఫాం టికెట్​ ధరలు పెరిగాయి.

Southern railway Platform ticket prices : చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లోని 8 రైల్వే స్టేషన్లలో ప్లాట్​ఫాం టికెట్​ ధరలు రూ. 10 నుంచి రూ.20కి చేరాయి. పెంచిన ధరలు 2023 జనవరి 31 వరకు అమల్లో ఉంటాయని అప్పుడే ఓ ప్రకటన చేసింది దక్షిణ రైల్వే. చెన్నై సెంట్రల్​, చెన్నై ఏగ్​మోర్​, తంబారం, కట్పాడీ, చెంగల్​పట్టు, అరక్కోణం, తిరువల్లూర్​, అవాడీ స్టేషన్లలో ఈ రేట్లు కొనసాగుతున్నాయి.

విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్​లోని అనేక రైల్వే స్టేషన్లలో కూడా ప్లాట్​ఫాం టికెట్​ ధరలు పెరిగాయి.

ఇక సెంట్రల్​ రైల్వే కూడా ప్లాట్​ఫాం టికెట్​ ధరలను పెంచింది. ఫలితంగా ముంబై తదితర ప్రాంతాల్లో ప్లాట్​ఫాం టికెట్​ ధరలు పెరిగాయి.

మరి ఈ ప్రాంతాల్లో ప్లాట్​ఫాం టికెట్​ ధరలు తగ్గుతాయా? లేదా? అన్నది వేచి చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం