Nayanthara surrogacy news: నయనతార సరోగసీపై తమిళనాడు కమిటీ నివేదిక ఏం చెప్పింది?
Nayanthara surrogacy news: నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ లు అద్దె గర్భం(surrogacy)ద్వారా కవలలకు జన్మనివ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై తమిళనాడు ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక సమర్పించింది.
Nayanthara surrogacy news: ప్రముఖ నటి నయన తార, సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ లు surrogacy ద్వారా కవలలు Uyir, Ulagham లకు జన్మనిచ్చిన వార్త వెలువడిన నాటి నుంచి వారిపై విమర్శల వర్షం కురుస్తోంది. surrogacy చట్టాలను ఉల్లంఘించారని, పెళ్లైన ఐదు నెలలకే పిల్లలకు జన్మనిచ్చారని, సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
Nayanthara surrogacy news: ప్రభుత్వ కమిటీ..
ఈ నేపథ్యంలో నయన తార, విఘ్నేశ్ లు surrogacy చట్టాలను ఉల్లంఘించారా? లేదా అని తేల్చడానికి తమిళనాడు ప్రభుత్వం నిపుణులతో ఒక త్రిసభ్య కమిటీని వేసింది. ఆ కమిటీ బుధవారం నివేదికను ప్రభుత్వానికి అందించినట్లు సమాచారం.
Nayanthara surrogacy news: అంతా చట్టబద్ధమే..
నయన తార, విఘ్నేశ్ లు surrogacy చట్టాలను ఉల్లంఘించలేదని, అంతా చట్టబద్ధంగాన జరిగిందని ఆ కమిటీ నివేదికలో తేల్చినట్లు సమాచారం. భారత్ లో వాణిజ్య తరహా సరోగసీ నేరం. అయితే, నయన్ దంపతులు భారత్ లోని surrogacy చట్టాలను ఉల్లంఘించలేదని ఆ కమిటీ తేల్చిందని తెలుస్తోంది. అయితే, ఆ సరోగసీ ప్రక్రియను పూర్తి చేసిన ఆసుపత్రిని మాత్రం కమిటీ తప్పుపట్టినట్లు తెలుస్తోంది.
Nayanthara surrogacy news: సరోగసీ మదర్ తో అగ్రిమెంట్
నయన్, విఘ్నేశ్ జంట తమకు గర్భం అద్దెకివ్వడానికి ఒప్పుకున్న మహిళతో నవంబర్ 2021లో ఒప్పందం చేసుకున్నారని కమిటీ తెలిపింది. ఆమె గర్భంలో పిండాన్ని ఈ సంవత్సరం మార్చిలో ప్రవేశపెట్టారని, అక్టోబర్ లో ఆమె కవలలకు జన్మనిచ్చిందని వివరించారు. నయన్, విఘ్నేశ్ లు ఈ జూన్ లో వివాహం చేసుకున్నారు. వారి వివాహానికి రజినీకాంత్, షారూఖ్ ఖాన్, ఏఆర్ రెహ్మాన్, సూరియా తదితర సినీ స్టార్లు హాజరయ్యారు.
Nayanthara surrogacy news: ఈ జనవరి నుంచే అమల్లోకి..
వాణిజ్య తరహా సరోగసీని నిషేధించే The Surrogacy (Regulation) Act 2021 గత డిసెంబర్ నెలలో పార్లమెంటు ఆమోదం పొందింది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఆ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ టైమ్ లైన్ ను పరిశీలిస్తే.. నయన్, విఘ్నేశ్ లు అద్దె గర్భం ఇవ్వడానికి అంగీకరించిన మహిళతో కుదుర్చుకున్న ఒప్పందం నాటికి(నవంబర్ 2021) ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు.