Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..-naturals ice cream founder raghunandan kamath passes away ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Sharath Chitturi HT Telugu
May 19, 2024 11:50 AM IST

Raghunandan Kamath death : ప్రముఖ నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూశారు. ఆయన వయస్సు 75ఏళ్లు.

రఘునందన్​ కామత్​ కన్నుమూత..
రఘునందన్​ కామత్​ కన్నుమూత.. (X)

Raghunandan Kamath naturals ice cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూశారు. ఈ విషయాన్ని.. సోషల్​ మీడియా ద్వారా వెల్లడించింది సంస్థ.

"నేచురల్స్​ ఐస్​ క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూశారు. ఇది మాకు చాలా బాధాకరమైన విషయం. నేచురల్స్​ ఫ్యామిలి," అని మ 18న ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది సంస్థ.

75ఏళ్ల కామత్​.. అనారోగ్య సమస్యల కారణంగా మే 17న మరణించినట్టు తెలుస్తోంది. ఆయనకు ఒక భార్య, కుమారులు ఉన్నారు.

నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ మరణంపై పలువు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"ఒక గొప్ప ప్రయాణం ముగిసింది. ఐస్​క్రీమ్​ మ్యాన్​ రఘునందన్​ కామత్​ మరణవార్త చాలా బాధ కలిగించింది," అని కర్ణాటక బీజేపీ చీఫ్​ కెప్టెన్​ బ్రిజేష్​ చౌవ్టా తెలిపారు.

Raghunandan Kamath passed away : "ఒక బ్రాండ్​ని నిర్మించాలని కలలు కని ముల్కీ నుంచి ముంబై వరకు వచ్చి ప్రతి ఐస్​క్రీమ్​ లవర్​కి నేచురల్​ ఛాయిస్​ అయ్యారు. రఘునందన్​ కామత్​ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి," చౌవ్టా అన్నారు.

ఐస్​క్రీమ్​ ఇండస్ట్రీలో రఘునందన్​ కామత్​ చాలా ఫేమస్​. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులోని ముల్కి అనే ప్రాంతంలో జన్మించారు. పండ్లు అమ్ముకునే తన తండ్రికి రఘునందన్​ కామత్​ చాలా సాయం చేసేవారు. 14ఏళ్ల వయస్సులో గ్రామాన్ని విడిచిపెట్టి.. ముంబైకి వెళ్లారు. తన సోదరుడి రెస్టారెంట్​లో పనిచేశారు.

1984 ఫిబ్రవరిలో ఐస్​క్రీమ్​ బిజినెస్​లోకి ఎంట్రీ ఇచ్చారు రఘునందన్​ కామత్​. మొదట్లో కేవలం 12 ఐస్​క్రీమ్​ ఫ్లేవర్స్​ని మాత్రమే విక్రయించేవారు. కస్టమర్లను ఆకర్షించేందుకు.. ఐస్​క్రీమ్​తో పాటు పావ్​బాజీని కూడా పక్కన పెట్టేవారు. ఈ స్ట్రాటజీ బంపర్​ హిట్​ కొట్టింది. ఆ వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగింది.

Naturals ice cream Raghunandan Kamath : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ బిజినెస్​ వృద్ధి చెందడంటో.. ఇక కేవలం ఐస్​క్రీమ్​ వ్యాపారంపైన ఫోకస్​ చేయాలని ఆయన నిర్ణయించున్నారు. అందుకు తగ్గట్టుగానే బిజినెస్​ని విస్తరించారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రాడక్ట్స్​ని తీసుకొచ్చారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా 135 నేచురల్స్​ ఔట్​లెట్స్​ ఉన్నాయి. సంస్థ వాల్యూ రూ. 400కోట్ల కన్నా ఎక్కువే!

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్