Republic Day 2022 | ఘనంగా 'రిపబ్లిక్​ డే' వేడుకలు.. మువ్వన్నెల జెండా రెపరెపలు-nation celebrates republic day 2022 cm s unfurl indian flag ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Republic Day 2022 | ఘనంగా 'రిపబ్లిక్​ డే' వేడుకలు.. మువ్వన్నెల జెండా రెపరెపలు

Republic Day 2022 | ఘనంగా 'రిపబ్లిక్​ డే' వేడుకలు.. మువ్వన్నెల జెండా రెపరెపలు

Sharath Chitturi HT Telugu
Jan 26, 2022 09:50 AM IST

73rd Republic Day news | దేశంలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జెండా వందనం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటు జవాన్లు సైతం రిపబ్లిక్​ డే వేడుకలు నిర్వహించారు. లద్దాఖ్​, ఉత్తరాఖండ్​లో.. ఎముకలు కొరికే చలిలో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటిచెప్పారు.

లద్దాఖ్​లో జాతీయ జెండాతో ఐటీబీపీ గణతంత్ర వేడుకలు
లద్దాఖ్​లో జాతీయ జెండాతో ఐటీబీపీ గణతంత్ర వేడుకలు (hindustan times)

దేశవ్యాప్తంగా రిపబ్లిక్​ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఉదయం 10:30 గంటలకు రిపబ్లిక్​ డే పరేడ్​ జరగనుంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. కాగా రాష్ట్రాల్లో ఇప్పటికే గణతంత్ర వేడుకలు మొదలయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ ఆఫీసుల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది.

చెన్నైలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో.. తమిళనాడు గవర్నర్​ ఆర్​ఎన్​ రవి, ముఖ్యమంత్రి ఎమ్​కే స్టాలిన్ పాల్గొన్నారు. అనంతరం పలువురు పౌరులు, అధికారులకు పురస్కారాలు అందజేశారు.

<p>గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న తమిళనాడు సీఎం స్టాలిన్​</p>
గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న తమిళనాడు సీఎం స్టాలిన్​ (Tamil Nadu CMO twitter)

బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​.. పాట్నాలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు రిపబ్లిక్​ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​.. భువనేశ్వర్​లో జరిగిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​.. జైపూర్​లోని ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసి, సెల్యూట్​ చేశారు.

<p>జాతీయ జెండాకు జేపీ నడ్డా సెల్యూట్​</p>
జాతీయ జెండాకు జేపీ నడ్డా సెల్యూట్​ (bjp delhi twitter)

జవాన్ల సెల్యూట్​..

'హిమవీరులు'గా పిలిచే ఇండో-టిబెటిన్​ బార్డర్​ పోలీసులు.. ఉత్తరాఖండ్​లోని ఔలిలో 73వ రిపబ్లిక్​ డే వేడుకలను జరుపుకున్నారు. అటు లద్దాఖ్​లోని ఐటీబీపీ దళాలు.. మైనస్​ 40 డిగ్రీల ఉష్ణోగ్రత, 15వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగరేసి సెల్యూట్​ చేశారు. జాతీయ గీతాన్ని ఆలపించి.. దేశభక్తిని చాటుకున్నారు.

<p>గణతంత్ర వేడుకల్లో జవాన్లు</p>
గణతంత్ర వేడుకల్లో జవాన్లు (ANI)
IPL_Entry_Point

సంబంధిత కథనం