Myntra job openings : పండుగ సీజన్​ వేళ మింత్రాలో వేకెన్సీలు..-myntra job openings hiring for 16000 vacancies ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Myntra Job Openings : పండుగ సీజన్​ వేళ మింత్రాలో వేకెన్సీలు..

Myntra job openings : పండుగ సీజన్​ వేళ మింత్రాలో వేకెన్సీలు..

Sharath Chitturi HT Telugu
Sep 10, 2022 11:01 AM IST

Myntra job openings : మింత్రాలో 16వేలకుపైగా ఉద్యోగాలు ఆఫర్​ చేశారు. ఆ వివరాలు..

మింత్రా
మింత్రా

Myntra job openings : ఫ్యాషన్​ ఈ కామర్స్​ సంస్థ మింత్రా.. ఈ ఫెస్టివల్​ సీజన్​ కోసం 16వేలకుపైగా ఉద్యోగాలను ఆఫర్​ చేస్తోంది. డెలివరీ, వేర్​హౌజ్​, లాజిస్టిక్స్​కు సంబంధించిన ఉద్యోగాలను సిద్ధం చేసింది. గతేడాది ఇదే సమయంలో.. 11వేల ఉద్యోగాలు ఇచ్చింది మింత్రా. ఈ సారి.. ఆ సంఖ్య పెరగడం విశేషం.

"16వేలకుపైగా జాబ్స్​లో.. 10వేలు ఉద్యోగాలు డైరక్ట్​గా పొందొచ్చు. మిగిలిన 6వేలు.. ఇండైరక్ట్​గా తీసుకుంటాము. మా సంస్థ చరిత్రలో.. ఫెస్టివల్​ సిజన్​కు ఇచ్చిన ఓపెనింగ్స్​లో ఇదే అత్యధికం," అని మింత్రా చీఫ్​ హెచ్​ఆర్​ ఆఫీసర్​ నుపుర్​ నాగ్​పాల్​ పేర్కొన్నారు.

నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఉన్న సప్లై చెయిన్​ మేనేజ్​మెంట్​ స్టాఫ్​ కొనసాగుతుంది. కాంట్రాక్ట్​ ప్రాతిపదికన తీసుకున్న ఉద్యోగులు.. కాల వ్యవధి ముగిసేంత వరకు కొనసాగుతారు.

Myntra job openings : సార్టింగ్​, ప్యాకింగ్​, పికింగ్​, లోడింగ్​, అన్​లోడింగ్​, డెలివరీ, రిటర్న్​ ఇన్​స్పెక్షన్​ వంటి పనులకు ఉద్యోగాలు ఆఫర్​ చేస్తోంది మింత్రా. కార్గో మేనేజ్​మెంట్​కి కూడా జాబ్స్​ను కేటాయించింది.

ఈ ఏడాది జూన్​ 11-16 మధ్య మింత్రా స్పెషల్​ సేల్​ జరిగింది. ఇందులో.. ఒక్క రోజులో 50లక్షల వస్తువులను విక్రయించింది. ఇది మింత్రా చరిత్రలో ఓ రికార్డుగా ఉంది. ఈ ఈవెంట్​లో భాగంగా.. తొలి 24గంటల్లోనే 2.6మిలియన్​ వస్తువుల షిప్పింగ్​ జరగడం విశేషం. ఈ సేల్​ కోసమే ప్రత్యేకంగా 27,500 థర్డ్​ పార్టీ ఎంప్లాయిమెంట్​ అవకాశాలను కల్పించింది మింత్రా.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్