Mumbai teen suicide : ఫోన్​ వాడొద్దని చెప్పినందుకు.. ఆత్మహత్య చేసుకున్న బాలిక!-mumbai teen commits suicide for not being allowed to use mobile phone ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mumbai Teen Suicide : ఫోన్​ వాడొద్దని చెప్పినందుకు.. ఆత్మహత్య చేసుకున్న బాలిక!

Mumbai teen suicide : ఫోన్​ వాడొద్దని చెప్పినందుకు.. ఆత్మహత్య చేసుకున్న బాలిక!

Sharath Chitturi HT Telugu
Apr 11, 2023 08:20 AM IST

Mumbai teen suicide : ఇంట్లో వాళ్లు ఫోన్​ ఎక్కువగా వాడొద్దని మందలించారు. ఆమె వినలేదు. చివరికి ఫోన్​ లాగేసుకున్నారు. మనస్తాపానికి గురైన ఆ 15ఏళ్ల బాలిక.. ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ముంబైలో జరిగింది.

ఫోన్​ వాడొద్దని చెప్పినందుకు.. ఆత్మహత్య చేసుకున్న బాలిక!
ఫోన్​ వాడొద్దని చెప్పినందుకు.. ఆత్మహత్య చేసుకున్న బాలిక!

Mumbai teen suicide : దేశంలో ఆత్మహత్య ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలిసీ తెలియని వయస్సులో టీనేజర్లు చిన్న చిన్న విషయాలకు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. మొబైల్​ వాడొద్దని పెద్దలు చెప్పినందుకు, ఓ బాలిక.. 7వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ముంబైలో కలకలం సృష్టించింది.

ఇదీ జరిగింది..

Mumbai girl commits suicide : 15ఏళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి మాలాద్​ సబ్​అర్బన్​ ప్రాంతంలోని మాల్వానిలో నివాసముంటోంది. కాగా.. ఆమె ఫోన్​ ఎక్కువగా వాడుతూ ఉంటుంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను మందలించారు. అయినప్పటికీ ఆ బాలిక ఫోన్​ వాడటం ఆపలేదు. చివరికి.. తల్లిదండ్రులు ఆమె ఫోన్​ను లాగేసుకున్నట్టు, ఎంత బతిమిలాడినా ఇవ్వలేదని తెలుస్తోంది.

ఈ క్రమంలో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది! చివరికి.. సూసైడ్​కు పాల్పడింది. గత శుక్రవారం సాయంత్రం.. ఓ 7 అంతస్తుల భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని చూసి స్థానికులు షాక్​ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆమె తల్లిదండ్రుల వివరాలను రాబట్టారు.

15 year old girl suicide news : కాగా.. బాలిక ఆత్మహత్యకు కారణం సరిగ్గా తెలియదని పోలీసులు చెబుతన్నారు. అయితే.. ఫోన్​ వాడొద్దని తల్లిదండ్రులు చెప్పడంతో, మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుందని అనుమానిస్తున్నట్టు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు.

హెయిర్​ కట్​ బాగోలేదని..

ఆత్మహత్య ఘటనలు మహారాష్ట్రలో ఆందోళనకరంగా మారాయి. ఇటీవలే.. ఓ 13ఏళ్ల బాలుడు సూసైడ్​ చేసుకున్నాడు. హెయిర్​ కట్​ నచ్చకపోవడంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నాడు! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Maharashtra crime news : ఇలాంటి ఘటనలు ఎన్నో వార్తల్లో నిలుస్తున్నాయి. చిన్న పిల్లలు, విద్యార్థులు తమ ప్రాణాలను బలి తీసుకుంటుండటం బాధాకరం. పెద్దలు వారిని నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని, వారికి సాయం చేసేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని మానసిక నిపుణులు సలహాలిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం