Mulayam Singh in ICU: ములాయం పరిస్థితి విషమం; ఐసీయూలో చికిత్స-mulayam singh continues to be critical shifted to icu says hospital ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mulayam Singh In Icu: ములాయం పరిస్థితి విషమం; ఐసీయూలో చికిత్స

Mulayam Singh in ICU: ములాయం పరిస్థితి విషమం; ఐసీయూలో చికిత్స

HT Telugu Desk HT Telugu
Oct 04, 2022 03:46 PM IST

Mulayam Singh in ICU: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

ములాయం సింగ్ యాదవ్
ములాయం సింగ్ యాదవ్ (PTI)

Mulayam Singh in ICU: సమజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, భారతదేశ సీనియర్ నాయకుల్లో ఒకరైన ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన వయస్సు 82 ఏళ్లు.

Mulayam Singh in ICU: ఐసీయూలో..

వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న ములాయం సింగ్ యాదవ్ గురుగ్రామ్ లోని మెడాంతా హాస్పిటల్ లోసెప్టెంబర్ 22 నుంచి చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు.. మంగళవారం పరిస్థితి కొద్దిగా విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి తరలించారు.

Mulayam Singh in ICU: ఆసుపత్రి ప్రకటన

అనంతరం, మంగళవారం మెడాంతా ఆసుపత్రి ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఒక బులెటిన్ ను విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కొద్దిగా విషమించడంతో ఐసీయూకి షిఫ్ట్ చేశామని, చికిత్స కొనసాగుతోందని ఆ బులెటిన్ లో వివరించింది. నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు వైద్యం అందిస్తోందని వెల్లడించింది. ఇదే విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ ట్విటర్ లోని పార్టీ అధికారిక హ్యాండిల్ లో తెలిపింది. పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్ త్వరగా కోలుకోవాలని అభిలషించింది.

IPL_Entry_Point