Stock Market Holiday : మొహర్రం పండుగ సందర్భంగా బ్యాంకులు, స్టాక్ మార్కెట్‌కు సెలవు
Stock Market Holiday : మొహర్రం పండుగ సందర్భంగా బ్యాంకులు, స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉండనుంది. దీనిని జాతీయ సెలవు దినంగా పరిగణిస్తారు.
మొహర్రం పండుగ బుధవారం జూలై 17న వస్తుంది. దీనిని జాతీయ సెలవుదినంగా పరిగణిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో మొహర్రం పండుగకు సెలవు ఉంది. ముహర్రం అనేది ముస్లిం సోదరులు జరుపుకొనే పండుగలో ముఖ్యమైనది. నాలుగు పవిత్ర మాసాలలో మొహర్రం ఒకటి. మొహర్రం భారతదేశంలో ప్రభుత్వ సెలవుదినం. అదే విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా చాలా బ్యాంకులకు జూలై 17న సెలవు. స్టాక్ మార్కెట్ కూడా మూసివేస్తారు.
మొహర్రం కోసం బ్యాంకులకు సెలవులు ఉన్న రాష్ట్రాల జాబితా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, జమ్మూ, ఉత్తర ప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, మిజోరం
జూలై 16న ఉత్తరాఖండ్‌లో హరేలా డే పండుగ కోసం బ్యాంకులకు సెలవు. హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగకు సెలవు ఉంది.
మొహర్రం పండుగకు జూలై 17 బుధవారం స్టాక్ మార్కెట్ మూసివేస్తారు. ఈక్విటీ సెగ్మెంట్ మాత్రమే కాదు, కరెన్సీ డెరివేటివ్స్, కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ కూడా బుధవారం మూస్తారు. ఈ ఏడాది చివరి వరకు మెుహర్రంతో సహా కొన్ని రోజుల పాటు స్టాక్ మార్కెట్ మూసివేస్తారు. దీపావళి, స్వాతంత్య్ర దినోత్సవం వంటి రోజులు కూడా ఈ సెలవు జాబితాలో ఉన్నాయి. స్టాక్ మార్కెట్ కింది రోజుల్లో మూసి ఉంటాయి.
జూలై 17: మెుహర్రం
ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం
అక్టోబర్ 2: గాంధీ జయంతి
నవంబర్ 1: దీపావళి
నవంబర్ 15: గురునానక్ జయంతి
డిసెంబర్ 25: క్రిస్మస్